తెలంగాణ

telangana

ETV Bharat / business

'ఆ ఉద్యోగులకు 2 వారాలు పెయిడ్​ లీవ్స్​' - -అమెజాన్​ ప్రకటన

కరోనా వైరస్​ కారణంగా అనారోగ్యంతో బాధపడుతున్న, నిర్బంధంలో ఉన్న ఉద్యోగులకు రెండు వారాల పాటు వేతనంతో కూడిన సెలవు ఇవ్వనుంది అమెజాన్. ఇందుకోసం 25 మిలియన్​ డాలర్లు కేటాయించింది.

Amazon increases paid sick leave due to coronavirus
'ఆ ఉద్యోగులకు 2 వారాలు పెయిడ్​ లీవ్స్​'

By

Published : Mar 12, 2020, 1:09 PM IST

కరోనా... ప్రస్తుతం ఈ పేరు వినగానే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. మానవాళి పైనే కాదు, ఆర్థిక రంగంపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. కొన్ని కంపెనీలు ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాయి.

ఉద్యోగుల సంక్షేమం కోసం మరో అడుగు ముందుకేసింది అమెజాన్. వైరస్​ వల్ల అనారోగ్యానికి గురైన వారికి, కరోనా సోకిందన్న అనుమానంతో నిర్బంధంలో ఉన్నవారికి వేతనంతో కూడిన సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం అమెజాన్​ రిలీఫ్​ ఫండ్​ పేరిట ఏకంగా 25 మిలియన్​ డాలర్లు కేటాయించినట్లు వెల్లడించింది.

"కరోనా వైరస్​ వల్ల నిర్బంధంలో ఉన్న, అనారోగ్యంతో బాధపడుతున్న అమెజాన్​ ఉద్యోగులకు రెండు వారాలపాటు వేతనాన్ని కంపెనీ అందజేస్తుంది. అనారోగ్యం వల్ల వేతనం నష్టపోతామని దిగులు చెందకుండా ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకునేందుకు ఇలా చేస్తున్నాము."

-అమెజాన్​ ప్రకటన

ప్రపంచవ్యాప్తంగా అమెజాన్​కు 8 లక్షల మంది ఫుల్​ టైమ్​ ఉద్యోగులు ఉన్నారు.

ఇదీ చూడండి:ఇరాన్​పై ట్రంప్​ దూకుడుకు కాంగ్రెస్​ కళ్లెం

ABOUT THE AUTHOR

...view details