తెలంగాణ

telangana

ETV Bharat / business

అమెజాన్​, ఫ్లిప్​కార్ట్ కొత్త సేల్​- ఫోన్లపై భారీ డిస్కౌంట్లు - ఫోన్లపై అమెజాన్ ఆఫర్లు

అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​లు మరోసారి భారీ డిస్కౌంట్లతో సేల్​కు సిద్ధమయ్యాయి. స్మార్ట్​ఫోన్లు, టీవీలు సహా ఇతర అన్ని రకాల ఉత్పత్తులపై ప్రత్యేక తగ్గింపు ఇవ్వనున్నట్లు తెలిపాయి. ఈ రెండు సంస్థలు ఇస్తున్న ఆఫర్ల పూర్తి వివరాలు.. సేల్ నిర్వహించే తేదీలు మీకోసం.

E-commerce sale
ఈ-కామర్స్ సేల్​

By

Published : Aug 3, 2021, 12:27 PM IST

Updated : Aug 3, 2021, 3:58 PM IST

ఈ-కామర్స్​ దిగ్గజాలు అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​లు మరోసారి సరికొత్త ఆఫర్లతో ముందుకొచ్చాయి. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్​, గృహోపకరణాలు, గ్రోసరీ వంటి వాటిని భారీ తగ్గింపు ధరకు విక్రయించనున్నాయి కంపెనీలు.

అమెజాన్​ ఆఫర్​ పూర్తి వివరాలు..

అమెజాన్​.. గ్రేట్ ఫ్రీడమ్​ పెస్టివల్​ పేరుతో సేల్​ నిర్వహించనుంది. ఈ సేల్​ ఆగస్టు 5 నుంచి 9 వరకు కొనసాగనుంది.

ఈ సేల్​లో ఎస్​బీఐ క్రెడిట్​ కార్డ్​ ద్వారా జరిపే లావాదేవీలపై (ఈఎంఐలకు కూడా) అదనంగా 10 శాతం తక్షణ డిస్కౌంట్​ పొందొచ్చని అమెజాన్ ప్రకటించింది. దీనితో పాటు అమెజాన్​ పే ద్వారా సైన్​ అప్ చేసుకున్న వారికి అదనంగా రూ.1000 వరకు క్యాష్​ బ్యాక్ ఇవ్వనున్నట్లు తెలిపింది.

ప్రైమ్​ యూజర్లు.. నో కాస్ట్ పరిమితి మూడు నెలలు అదనంగా పొందొచ్చని.. ఆరు నెలల వరకు శాంసంగ్​, షియోమీ, ఐకూ వంటి ఫోన్లకు ఉచిత స్క్రీన్​ రీప్లేస్​మెంట్ వంటి ప్రత్యేక ఆఫర్లను పొందొచ్చని వెల్లడించింది అమెజాన్​.

  • స్మార్ట్​ఫోన్ల, ఇతర యాక్సెసిరీస్​లపై 40 శాతం వరకు డిస్కౌంట్​
  • కెమెరాలు, ట్రైపాడ్స్​, రింగ్ లైట్స్, హెడ్​ఫోన్స్​, స్పీకర్స్ వంటి వాటిపై 60 శాతం వరకు తగ్గింపు
  • ల్యాప్​టాప్​లపై రూ.30 వేల వరకు, డెస్క్​ టాప్​లపై రూ.40 వేల వరకు తగ్గింపు.
  • స్మార్ట్​ వాచ్​లుపై కూడా 60 శాతం వరకు డిస్కొంట్​

ఫ్లిప్​కార్ట్​ బిగ్​ సేవింగ్​ డేస్​ సేల్​

అమెజాన్​కు పోటీగా ఫ్లిప్​కార్ట్​ కూడా భారీ డిస్కౌంట్లతో మరోసారి బిగ్​ సేవింగ్ డేస్​ సేల్​ను ప్రకటించింది. ఈ నెల 5 నుంచి 9 వరకు డిస్కౌంట్ సేల్​ నిర్వహించనున్నట్లు తెలిపింది.

ఈ సారి సేల్​లో యాక్సిస్​, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్​ కార్డ్​ లావాదేవీలు, ఈఎంఐలపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ పొందే వీలుంది.

ఫ్లిప్​కార్ట్ వెబ్​సైట్​ ప్రకారం.. ఎలక్రానిక్, యాక్సెసిరీస్​లపై 80 శాతం వరకు, హెడ్​ఫోన్స్​, స్పీకర్లు, ట్యాబ్లెట్స్ వంటి వాటిపై 70 శాతం వరకు డిస్కౌంట్ ఉండనున్నట్లు తెలిసింది.

టీవీలు, ఇతర ఉపకరణాలపై 75 శాతం వరకు ఇవ్వనున్నట్లు పేర్కొంది ఫ్లిప్​కార్ట్​.

ఈ సారి సేల్​లో.. 'క్రెజీ డీల్​' కూడా ఉండనున్నట్లు తెలిసింది. సేల్​ జరిగే రోజుల్లో అర్థరాత్రి 12 గంటలకు, ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 4 గంటలకు క్రెజీ డీల్​ నిర్వహించనుంది ఫ్లిప్​కార్ట్​. దీనితో పాటు.. ఎంపిక చేసిన ఉత్పత్తులపై టిక్​టాక్​ డీల్​ పేరిట పరిమిత కాల ఆఫర్​ అందుబాటులోకి తేనుంది.

ఇవీ చదవండి:

Last Updated : Aug 3, 2021, 3:58 PM IST

ABOUT THE AUTHOR

...view details