దేశీయ ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ప్లిప్‌కార్ట్ మరో సారి భారీ సేల్కు సిద్ధమయ్యాయి. ప్రతి ఏడాదిలానే ఈ సారి కూడా పండుగ సీజన్ ఆఫర్లతో సేల్ నిర్వహించేందుకు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (Amazon Great Indian Festival), ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ (Flipkart Big billon days) గురించి అధికారికంగా ప్రకటన చేశాయి.
అయితే ఈ సేల్స్ తేదీలను ఇంకా ప్రకటించలేదు ఇరు సంస్థలు. అక్టోబర్ మొదటి వారం చివర్లో ఈ సేల్స్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. సేల్ తేదీ, ఆఫర్ల గురించి స్పష్టమైన సమాచారం ఇవ్వనప్పటికీ పలు వివరాలను తెలిపాయి ఈ సంస్థలు.
ఆఫర్లు ఇలా!
అమెజాన్..
ఈ సేల్ కోసం హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌తో ఒప్పందం చేసుకున్నట్లు అమెజాన్ వెల్లడించింది. హెచ్డీఎఫ్సీ క్రెడిట్, డెబిట్ కార్డ్ ద్వారా జరిపే లావాదేవీలకు ఆఫర్ డిస్కౌంట్‌తో పాటు.. అదనంగా 10 శాతం క్యాష్ బ్యాక్ (Amazon cash back offers) లభించనున్నట్లు తెలిపింది. అమెజాన్ పే ద్వారా చెల్లింపులు జరిపితే 5 శాతం క్యాష్ బ్యాక్ లభించనున్నట్లు పేర్కొంది.
ఈ సేల్ (Amazon Great Indian Festival)లో ఎలక్ట్రానిక్స్‌పై 40 శాతం వరకు డిస్కౌంట్ లభించే అవకాశం ఉంది. మరిన్ని ఆఫర్లను త్వరలోనే ప్రకటించనుంది ఈ సంస్థ.
ఫ్లిప్‌కార్ట్
ఈ సారి సేల్‌లో (Flipkart Big billon days) భారీ క్యాష్ బ్యాక్స్‌తో పాటు రివార్డ్స్ కూడా ఇవ్వనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు బ్యాంకింగ్ భాగస్వాములుగా ఉన్నట్లు తెలిపింది. ఈ బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించి పేమెంట్ చేసే వారికి బిగ్ బిలియన్ డేస్ ఆఫర్ తోపాటు.. అదనపు డిస్కౌంట్ లభించనున్నట్లు తెలిపింది. పేటీఎం ద్వారా జరిపే చెల్లింపులకు కూడా డిస్కౌంట్ ఉంటుందని వివరించింది.
ఎలక్ట్రానిక్స్, గాడ్జెట్స్‌పై ఈ సేల్‌లో 80 శాతం వరకు డిస్కౌంట్ (Flipkart offers on Gadgets) లభించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా టీవీలపై 70 శాతం వరకు, ఫ్రిడ్జ్‌లపై 50 శాతం వరకు తగ్గింపు ఉండొచ్చని సమాచారం.
సేల్ ప్రారంభమయ్యాక.. ప్రతి రోజు ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం 4 గంటలకు ఫ్లాష్ సేల్ (Flipkart Flash sale) నిర్వహిస్తుంటుంది ఫ్లిప్‌కార్ట్. ఈ సారి కూడా ఈ ఆనవాయితీని కొనసాగించే వీలుంది.
ఇవీ చదవండి: