పండుగల సందర్భంగా రాయితీ విక్రయాలకు ఉద్దేశించిన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్(జీఐఎఫ్)ను(Amazon Great Indian Festival 2021) అక్టోబరు 3 నుంచే ప్రారంభించబోతున్నట్లు అమెజాన్ ఇండియా ప్రకటించింది. ఇంతకుముందు ప్రకటించిన ప్రకారం అక్టోబరు 4 నుంచి జీఐఎఫ్(Amazon Great Indian Festival 2021) ప్రారంభించాల్సి ఉంది.
ఇదేవిధంగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్(Flipkart Big Billion Days 2021) కూడా అక్టోబరు 7-12 తేదీలకు బదులు 3-10 తేదీల్లో జరగనుంది. గతేడాది పండుగ సీజన్‌లో ఇ-కామర్స్ దిగ్గజాల అమ్మకాలు 740 కోట్లుగా నమోదు కాగా, ఈ ఏడాది 900 కోట్ల డాలర్ల మేర జరగొచ్చని కన్సల్టింగ్ సంస్థ రెడ్‌సీర్ అంచనా వేసింది.
ఫ్లిప్కార్ట్లో రాయితీలు..
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు, ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ కార్డులతో కొనుగోళ్లపై 10శాతం వరకు 'బిగ్ బిలియన్ డేస్'లో(Flipkart Big Billion Days 2021) విక్రయాల్లో రాయితీ లభిస్తుందని ఫ్లిప్‌కార్ట్ ఇదివరకు తెలిపింది. అవసరమైన వస్తువులను ముందస్తుగా బుక్ చేసుకునే వీలు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. కిరాణా దుకాణాలకు రూ.8లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇస్తున్నట్లు సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి తెలిపారు.