చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) సుందర్ పిచాయ్‌కి 2019 సంవత్సరానికి గాను 280 మిలియన్ డాలర్లకుపైగా (దాదాపు రూ.21,364 కోట్లు)పారితోషికం చెల్లించినట్టు గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ప్రకటించింది. దీనితో ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం పొందుతున్న సీఈఓల జాబితాలో ఒకరిగా సుందర్ పిచాయ్ నిలిచారు.
భారత్‌కు చెందిన 47 ఏళ్ల సుందర్ పిచాయ్ 2019 డిసెంబర్ 3న ఆల్ఫాబెట్ సీఈఓగా నియమితులయ్యారు.
పిచాయ్ పారితోషికంలో అధిక భాగం స్టాక్ అవార్డుల రూపంలో చెల్లించారు. అంటే మార్కెట్‌లో ఆల్ఫాబెట్ షేర్ల హెచ్చుతగ్గులకు అనుగుణంగా ఆయన వార్షిక వేతనాన్ని లెక్కిస్తారు.