తెలంగాణ

telangana

'త్వరలోనే పూర్తి స్థాయికి దేశీయ విమాన సేవలు'

భారత్​లో దేశీయ విమాన సర్వీసులు 65శాతం సాధారణ స్థితికి చేరాయని పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్​ సింగ్​ ఖరోలా తెలిపారు. శుక్రవారం దాదాపు 2లక్షల 50వేల మంది దేశీయ విమానాల్లో ప్రయాణించారని పేర్కొన్నారు.

By

Published : Nov 28, 2020, 6:33 PM IST

Published : Nov 28, 2020, 6:33 PM IST

Almost 65 pc of domestic air travel back to pre COVID-19 level: Kharola
'త్వరలో యాథాతథ స్థితికి దేశీయ విమాన సేవలు'

దేశీయ విమాన సర్వీసులపై కీలక వ్యాఖ్యలు చేశారు పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్​ సింగ్​ ఖరోలా. దేశంలో విమాన కార్యకలాపాలు 65శాతం సాధారణ స్థితికి చేరాయన్నారు. "ఏవియేషన్​ అండ్​ టూరిజం-ది రోడ్ ఎహెడ్​" అంశంపై 'ఫెడరేషన్ అసోసియేషన్​ ఆఫ్ ఇండియన్​ టూరిజం అండ్​ హాస్పిటాలిటీ' నిర్వహించిన వెబినార్​లో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.

శుక్రవారం ఒక్కరోజే దాదాపు 2 లక్షల 50వేల మంది దేశీయ విమానాల్లో ప్రయాణించారని తెలిపారు ప్రదీప్​ సింగ్​. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. కరోనా​కు ముందు 3 లక్షల 70 వేల నుంచి 3 లక్షల 75వేల మంది ప్రయాణించేవారని వివరించారు.

పర్యటక రంగం పున:ప్రారంభానికి అనుమతులు ఇవ్వాలని అభిప్రాయపడ్డారు ప్రదీప్​ సింగ్​. పర్యటక రంగ సంస్థలు దేశీయ విమాన సర్వీసులను ప్రోత్సహించాలని కోరారు.

ఇదీ చదవండి:అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు పొడిగింపు

ABOUT THE AUTHOR

...view details