కరోనా వైరస్, లాక్‌డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న ఐటీ రంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని నాస్‌కామ్ (నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్) కోరింది. బెంచ్ ఉద్యోగులకు కనీస వేతనాలు మాత్రమే ఇవ్వడానికి అనుమతించడం ద్వారా బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ (బీపీఎం), గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ)లో ఉద్యోగాల కోత పడకుండా నివారించవచ్చని సూచించింది.
* లాక్‌డౌన్ వల్ల ఈ విభాగాలు 70 శాతం మంది ఉద్యోగులను మాత్రమే వినియోగించుకోగలుగుతున్నాయని తెలిపింది. 20 శాతం మందికి ప్రాజెక్టులు లేవనుకుంటే, వీరందరికీ పూర్తి వేతనాలు ఇవ్వడం భారమవుతుందని, అందువల్ల చట్టబద్ద చెల్లింపులతో పాటు కనీస వేతనాలకు అనుమతినిస్తే, ఉద్యోగ కోతలు లేకుండా చూడొచ్చని విశదీకరించింది.