తెలంగాణ

telangana

ETV Bharat / business

కోటీశ్వరుడిగా ఎలా మారాలో తెలుసా? - పెట్టుబడులతో కోటి రూపాయలు సంపాదించడం ఎలా

పొదుపు మార్గాల ద్వారా కోటి రూపాయలు సంపాదించాలని ఉందా? క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టి కోటీశ్వరుల జాబితాలోకి చేరాలని ఉందా? మరి దీనికి ఏ అంశాలు దోహదం చేస్తాయి, ఎంత సమయంలో కోటీశ్వరులు అవుతారో తెలుసా?

DUMMY
కోటీశ్వరుడు అవ్వటం ఎలాగో తెలుసా?

By

Published : Jan 3, 2021, 7:30 AM IST

ఒక కోటి రూపాయలు... ఇంత మొత్తం సంపాదించాలనే కల చాలా మందికి ఉంటుంది. కోటి రూపాయలతో కల నెరవేరుతుందా అనేది వ్యక్తిగత అంశాలపై ఆధారపడి ఉంటుంది. వీలైనంత తొందరగా ప్రారంభించి క్రమం తప్పకుండా పెట్టుబడి పెడుతున్నట్లయితే ఇది పెద్ద కష్టమైన పనేం కాదు అని వ్యక్తిగత ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ఎంత తొందరగా కోటీశ్వరుడు అవుతారనేది ఫండ్​పై వచ్చే రాబడి, మీరు పెట్టే పెట్టుబడిపై ఆధారపడి ఉంటుంది. మరో విధంగా చెప్పాలంటే ఈ రెండు అంశాలపైనే కోటి రూపాయల సంపద సృష్టి అవుతుంది.

ఉదాహరణకు ఓ ఫండ్ వార్షికంగా 14 శాతం రాబడిని ఇస్తోందనుకోండి. నెలకు రూ. 2500 సిప్ రూపంలో పెట్టుబడి పెట్టినట్లయితే 28 సంవత్సరాల్లో పెట్టుబడితో పాటు రాబడి కలిపి రూ. 1.03 కోట్లకు చేరుతుంది. అదే రూ.4వేలు పెట్టుబడి చేసినట్లయితే కేవలం 25 ఏళ్లలో పెట్టుబడి విలువ పెరుగుతుంది. ఈ నాలుగు వేల సిప్​ను 25 ఏళ్ల అనంతరం కూడా కొనసాగించినట్లయితే 30 ఏళ్లకు రూ. 2.2 కోట్లకు చేరుతుంది మొత్తం పెట్టుబడి, రాబడి విలువ.

కోటి రూపాయలు సరిపోతుందా?

కోటి రూపాయలు అనగానే ప్రస్తుతం ఎక్కువ మొత్తమే అనిపిస్తుంది. కానీ 25 ఏళ్ల అనంతరం ఆ మొత్తం తక్కువనే అనిపించే అవకాశం ఉంటుంది. దీనికి కారణం ధరల పెరుగుదల. 6 శాతం ద్రవ్యోల్బణాన్ని తీసుకుంటే 25 ఏళ్ల అనంతరం ఇప్పటి కోటి రూపాయల విలువ రూ. 4.29 కోట్లకు చేరుతుంది. అంటే ఇప్పటి కోటి రూపాయల విలువ 25 ఏళ్ల అనంతరం రూ. 4.29 కోట్లకు సమానం. కాబట్టి దానిని దృష్టిలో ఉంచుకొని ప్రణాళిక వేసుకోవాలని వ్యక్తిగత ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అవసరమైనట్లయితే ఆర్థిక ప్రణాళికకు సంబంధించిన సలహాదారులను నియమించుకునే అంశాన్ని కూడా పరిశీలించాలని వారు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి:ఆర్థిక ప్రణాళికకు పాటించాల్సిన నాలుగు లక్షణాలు

ABOUT THE AUTHOR

...view details