భారతీయులకు బంగారం అంటే చాలా ఇష్టం. సంస్కృతి, సంప్రదాయాల్లో బంగారం భాగంగా వస్తోంది. పెళ్లిళ్లు పేరంటాలు ఏవైనా ఆడవాళ్లు బంగారం ధరించాల్సిందే. పెళ్లి జరిగినప్పుడు పెళ్లి కూతురు ఒంటిపై బంగారం మెరవాల్సిందే. ఇండియాలో బంగారాన్ని కేవలం పెట్టుబడి సాధానంగా మాత్రమే పరిగణించరు.
దేశంలో చాలా ఇళ్లలో బంగారం లేకపోయినా, బంగారు ఆభరణాలైతే ఉంటాయి. భారతీయ గృహిణుల పొదుపుల్లో బంగారం నాలుగింట మూడోంతుల ఉంటాయి. ఎంత వరకు బంగారం మన వద్ద పెట్టుకోవచ్చు? ఎంతస్థాయి వరకు పత్రాలు అవసరం ఉండవు? ఈ విషయాలపై అవగాహన చాలా తక్కువ మందికి ఉంటుంది.
ఆదాయ స్థాయితో సంబంధం లేకుండా కొంచెం మొత్తంలో బంగారం మన వద్ద ఉంచుకోవచ్చు. ఇది ఆడవారికి, మగవారికి వేరువేరుగా ఉంటుంది. పెళ్లైన ఆడవారు 500 గ్రాముల బంగారం, పెళ్లి కానీ ఆడవారు 250 గ్రాముల బంగారం ఉంచుకోవచ్చు. అయితే మగవారు మాత్రం.. 100 గ్రాముల వరకు ఉంచుకోవచ్చు.
ఈ స్థాయుల వరకు ఎలాంటి ఆదాయ ధ్రువీకరణ సమర్పించాల్సిన అవసరం ఉండదు. ఆదాయ స్థాయులతో దీనికి సంబంధం ఉండదు.
లిమిట్ దాటినట్లైతే..
లిమిట్ వరకు ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు. కానీ ఈ లిమిట్ కంటే ఎక్కువ బంగారం ఉన్నట్లయితే ఆదాయానికి సంబంధించి పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.