కరోనా విజృంభణతో ప్రపంచవ్యాప్తంగా గతంలో ఎన్నడూ చూడనంతగా ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. దీనితో పెట్టుబడి సాధనాల్లో భారీ మార్పులు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని స్టాక్ మార్కెట్లు ఓ కుదుపునకు లోనయ్యాయి. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లోనూ ఒక పెట్టుబడి సాధనం మాత్రం లాభాల పంట పండించింది. అదే బంగారం.. చాలా మంది బంగారమే ప్రస్తుత పరిస్థితుల్లో సురక్షితమని భావించి.. భారీగా పెట్టుబడులు పెట్టారు. దీనితో పసిడి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఒకానొక దశలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.57 వేలు దాటింది అంటే.. డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ విషయాలు తెలుసుకోండి.
బంగారంపై సురక్షిత పెట్టుబడుల్లో మ్యూచువల్ ఫండ్ల విధానం ఒకటి. వీటి ద్వారా పెట్టుబడి పెడితే.. తయారీ ఖర్చులు, నాణ్యత, భద్రత, బీమా వంటి వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. గోల్డ్ మ్యూచ్‌వల్ ఫండ్లలో 4 విధానాలు ఉన్నాయి. అవి.. గోల్డ్ ఫండ్లు, గోల్డ్ ఈటీఎఫ్‌లు, మల్టీ అసెట్ ఫండ్లు, అంతర్జాతీయ గోల్డ్ ఫండ్లు.
గోల్డ్ ఈటీఎఫ్‌లు…
ఈటీఎఫ్ అంటే ఎక్సైంజీ ట్రేడెడ్ ఫండ్. ఇవి స్టాక్ ఎక్స్చేంజీలలో ట్రేడవుతుంటాయి. ఇవి భౌతిక బంగారంపై పెట్టుబడి పెడుతుంటాయి. ఒక్క గోల్డ్ ఈటీఎఫ్ యూనిట్ సగం గ్రాము 24 క్యారెట్ల బంగారానికి సమానం. గోల్డ్ ఈటీఎఫ్‌లనూ.. ఎక్స్చేంజీలలో కావాల్సినప్పుడు విక్రయించుకోవచ్చు. అందువల్ల దీనికి లిక్విడిటీ ఎక్కువ. భౌతిక బంగారం ధరలకు అనుగుణంగా ఈ ఈటీఎఫ్‌లు ట్రేడవుతుంటాయి. మార్కెట్ ధరలను బట్టి విక్రయించుకోవచ్చు.
ఇదీ చూడండి:-గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు 86 శాతం వృద్ధి