ఆకాశ ఎయిర్ పేరుతో (akasa air news) విమాన రంగంలోకి అడుగు పెట్టిన బిగ్బుల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా.. భారత్‌లో సర్వీసులు ప్రారంభించడం కోసం 72 బోయింగ్ విమానాలను ఆర్డర్ ఇచ్చారు. ఈ మేరకు ఆమెరికాకు చెందిన ఏరోస్పేస్ కంపెనీ బోయింగ్ నుంచి '737 మ్యాక్స్' విమానాలను దిగుమతి చేసుకోనున్నారు.
72 విమానాలు కొంటున్న ఝున్‌ఝున్‌వాలా.. ఎందుకంటే?
రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా సహా మరికొంత మంది కలిసి ఏర్పాటు చేసిన విమానయాన సంస్థ 'ఆకాశ ఎయిర్' (akasa air news) 72 విమానాలను ఆర్డర్ ఇచ్చింది. ఈ విషయాన్ని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా
బోయింగ్‌లోని రెండు వేరియంట్లు అయిన 737-8తో పాటు అధిక-సామర్థ్యం కలిగి ఉండే 737-8-200లను ఆకాశ్ ఎయిర్ ఆర్డర్ ఇచ్చిందని బోయింగ్ తెలిపింది. ఇప్పటికే రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా సహా మరికొంత మంది కలిసి ఏర్పాటు చేసిన విమానయాన సంస్థ 'ఆకాశ ఎయిర్'కు (Rakesh Jhunjhunwala Airlines) పౌరవిమానయాన శాఖ నుంచి ఎన్ఓసీ లభించింది.