టెలికాం కంపెనీలు తమ డిఫర్డ్ స్పెక్ట్రం బకాయిలను మంగళవారం చెల్లించాయి. వొడాఫోన్ ఐడియా రూ.3,043 కోట్లు, భారతీ ఎయిర్‌టెల్ రూ.1,950 కోట్లు, రిలయన్స్ జియో రూ.1,053 కోట్ల మేర చెల్లించాయి.
ఈ డిఫర్డ్ స్పెక్ట్రం బకాయిలు కోసం టెల్కోలు చేసే చివరి చెల్లింపులు ఇవే అవుతాయి. ఎందుకంటే కేంద్ర కేబినెట్ గతేడాది చివర్లో ఇటువంటి స్పెక్ట్రం చెల్లింపు బకాయిలపై రెండేళ్ల తాత్కాలిక నిషేధాన్ని ఆమోదించింది.
సుప్రీం ఆగ్రహంతో..
టాటా టెలిసర్వీసెస్ లిమిటెడ్... టెలికాం విభాగానికి సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) బకాయి కింద మరో రూ.2,000 కోట్లు చెల్లించింది. ఇదే కంపెనీ ఫిబ్రవరి 17న కంపెనీ లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రం వినియోగ ఛార్జీల కోసం రూ.2,197 కోట్లు జమ చేసింది.