5జీ ఫీల్డ్ ట్రయల్స్‌లో భారతీ ఎయిర్టెల్ సత్తా చాటింది. ముంబయిలో నిర్వహించిన ప్రయోగాల్లో ఏకంగా 1 జీబీపీఎస్ వేగాన్ని అందుకుంది. నోకియా నెట్వర్క్ గేర్‌ను ఉపయోగించి ఈ ట్రయల్స్ చేపట్టినట్లు తెలుస్తోంది.
ముంబయి ఫీనిక్స్ మాల్లోని లోవర్ పరేల్‌లో ఎయిర్టెల్ ఈ 5జీ ట్రయల్స్‌ను చేపడుతోంది.
"టెలికాం శాఖ మార్గదర్శకాలను అనుసరించి ప్రకారం ఎయిర్టెల్.. 3500 మెగా హెర్జ్ బ్యాండ్‌లో ఈ ట్రయల్స్ చేపడుతోంది. ట్రయల్స్‌లో ఇంటర్నెట్ వేగం 1 జీబీపీఎస్ దాటింది. త్వరలో కోల్‌కతాలోనూ 5జీ ట్రయల్స్ చేపట్టాలని ఎయిర్టెల్, నోకియా సంస్థలు భావిస్తున్నాయి."