తెలంగాణ

telangana

ETV Bharat / business

'మా బ్యాంకింగ్​ పాయింట్ల వద్ద ఆధార్​తోనూ చెల్లింపులు' - ఆధార్ ఆధారిత‌ పేమెంట్ సిస్టమ్

ఆధార్​ ఆధారిత పేమెంట్ సిస్టమ్​ (ఏఈపీఎస్​) ను ప్రారంభించినట్లు ఎయిర్​టెల్​ పేమెంట్స్ బ్యాంకు శుక్రవారం ప్రకటించింది. దీనితో ఇప్పుడు ఆధార్-అనుసంధానిత‌ బ్యాంక్ ఖాతాలు ఉన్న ఏదైనా బ్యాంకు వినియోగదారులు ఎయిర్​టెల్​ పేమెంట్స్ బ్యాంక్ ప్రారంభించిన‌ బ్యాంకింగ్ పాయింట్ల వద్ద ఆర్థిక లావాదేవీలు చేయవచ్చు.

Airtel Payments Bank Aadhaar enabled payment system
ఆధార్‌తో చెల్లింపుల‌ను ప్రారంభించిన ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌

By

Published : Feb 29, 2020, 5:42 AM IST

Updated : Mar 2, 2020, 10:25 PM IST

భారతదేశం అంతటా 2,50,000 బ్యాంకింగ్ పాయింట్ల వద్ద ఆధార్-ఆధారిత‌ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్​)ను ప్రారంభించినట్లు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ శుక్రవారం ప్రకటించింది. ఆధార్-అనుసంధానిత‌ బ్యాంక్ ఖాతాలు ఉన్న ఏదైనా బ్యాంకు వినియోగదారులు ఇప్పుడు ఎయిర్​టెల్​ పేమెంట్స్ బ్యాంక్ ప్రారంభించిన‌ బ్యాంకింగ్ పాయింట్ల వద్ద ఆర్థిక లావాదేవీలు చేయవచ్చు.

ఏఈపీఎస్, ప్రతి ఒక్కరికీ వారి ఆధార్‌ను మాత్రమే ఉపయోగించడం ద్వారా సురక్షితమైన బ్యాంకింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది.

లావాదేవీలు సురక్షితం

ఆధార్-లింక్డ్ బ్యాంక్ ఖాతాను అనుమ‌తించేందుకు వారి ఆధార్ నంబర్ లేదా వర్చువల్ ఐడీని ఉపయోగించి మైక్రో ఏటీఎమ్‌లో ఉపసంహరణలు, బ్యాలెన్స్ ఎంక్వైరీలు, మినీ-స్టేట్‌మెంట్‌లు వంటి ఆర్థిక లావాదేవీలను నిర్వహించడానికి ఏఈపీఎస్​ వినియోగదారులను అనుమతిస్తుంది. ఆధార్ నంబర్, వేలిముద్ర రికార్డులతో సరిపోలితే మాత్రమే లావాదేవీలు ప్రామాణీకరిస్తుంది.

ఇది బ్యాంకింగ్ ప్రక్రియల భద్రతను మ‌రింత‌ పెంచుతుందని ఎయిర్‌టెల్ తెలిపింది, ఎందుకంటే వినియోగదారులు తమ బ్యాంకింగ్ లావాదేవీలను కేవలం వారి ఆధార్ నంబర్‌తో తమ బ్యాంకు ఖాతా లేదా డెబిట్ కార్డు వివరాలను ఎవరికీ వెల్లడించకుండా పూర్తి చేస్తారు.

ఇదీ చూడండి:ఏడేళ్లుగా కొనసాగుతన్న వృద్ధి క్షీణతను తగ్గించాం: ఎఫ్​ఎమ్​

Last Updated : Mar 2, 2020, 10:25 PM IST

ABOUT THE AUTHOR

...view details