Airtel Down: భారత్‌లో ఎయిర్‌టెల్ సేవలకు అంతరాయం ఏర్పడింది. సాంకేతిక లోపం వల్ల వినియోగదారులు ఇబ్బంది పడినట్లు ఆ సంస్థ ధ్రువీకరించింది. అయితే కొద్దిసేపటికే సమస్యను పరిష్కరించినట్లు తెలిపింది. దీనిపై సామాజిక మాధ్యమాల వేదికగా పలువురు వినియోగదారులు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు సహా అనేక ప్రధాన నగరాల్లో ఉదయం 11 గంటల సమయంలో తలెత్తిన ఈ సమస్య టెలికాం నెట్‌వర్క్‌లోని బ్రాడ్‌బ్యాండ్, సెల్యులార్ వినియోగదారులపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.
'అసౌకర్యానికి చింతిస్తున్నాం'
ఈ సమస్యను పరిష్కరించి.. కొద్దిసేపటికే సేవలు పునరుద్ధరించినట్లు ఎయిర్‌టెల్ ప్రతినిధి ఒకరు తెలిపారు. "సాంకేతిక లోపం వల్ల ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. అయితే స్వల్ప వ్యవధిలోనే సమస్యను పరిష్కరించి.. సేవలను పునరుద్ధరించాం. వినియోగదారుల అసౌకర్యానికి చింతిస్తున్నాం" అని ఎయిర్‌టెల్ ప్రతినిధి పేర్కొన్నారు.
అప్పటికే ఎయిర్‌టెల్ వినియోగదారులు.. ట్విట్టర్ వేదికగా ఫిర్యాదులు చేశారు. ఎయిర్‌టెల్ ఇంటర్నెట్ సేవలు, మొబైల్ నెట్‌వర్క్, ఎయిర్‌టెల్ యాప్ సహా కస్టమర్ కేర్‌కు కూడా ఫోన్ కలవలేదని 'ఎయిర్టెల్డౌన్' అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్లు చేశారు.
ఇదీ చూడండి:మార్కెట్లపై అమెరికా ద్రవ్యోల్బణం దెబ్బ.. రూ.3.39 లక్షల కోట్లు ఆవిరి!