తెలంగాణ

telangana

ETV Bharat / business

ఇకపై ఇళ్లలోనూ మెరుగైన సిగ్నల్‌ - ఎయిర్​టెల్ సమాచారం​

భారతీ ఎయిర్​టెల్​ సేవలు అందిస్తున్న సర్కిళ్లలో సిగ్నలింగ్​ వ్యవస్థను మరింత బలో పేతం చేసే దిశగా ముందుకు వెళ్తోంది. ఫోన్​ మాట్లాడేటప్పుడు వినియోగదారులు ఎటువంటి అవాంతరాలు లేకుండా ఉండేలా చర్యలు చేపట్టింది. దీంతో డేటా వేగం కూడా పెరగనుంది.

Airtel come up with 2G spectrum for 4G services to give better signal coverage in indoor
ఇకపై ఇళ్లలోనూ మెరుగైన సిగ్నల్‌

By

Published : Nov 18, 2020, 8:16 AM IST

భారతీ ఎయిర్‌టెల్‌ తాము సేవలు అందిస్తున్న 10 టెలికాం సర్కిళ్లలో భవనాల లోపలా మొబైల్‌ మాటలు స్పష్టంగా వినపడేలా, డేటా వేగం బాగుండేలా కవరేజీని విస్తృతం చేయనుంది. ఇందు కోసం 900 మెగాహెడ్జ్​ బ్యాండ్‌లో 4జీ సాంకేతికతను ఏర్పాటు చేస్తోంది. ఈ బ్యాండ్‌ను 2జీ సేవల కోసం కంపెనీ వినియోగించేది. ఆంధ్రప్రదేశ్‌, దిల్లీ, కోల్‌కతా, కర్ణాటక, రాజస్థాన్‌, ఈశాన్య రాష్ట్రాల సర్కిళ్లలో ఈ బ్యాండ్‌ను పునః వ్యవస్థీకరించి 4జీ సేవలను విస్తరించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇప్పటికే కంపెనీ దేశవ్యాప్తంగా 3జీ మౌలిక వసతులను 4జీకి అనుగుణంగా మార్పిడి చేసినట్లు ఒక సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ తెలిపారు. ఈ మార్పిళ్ల కారణంగా భవనాలు, అపార్ట్‌మెంట్ల లోపల కూడా మొబైల్‌ సిగ్నళ్లు బలంగా రావడానికి వీలు కలుగుతుంది. ఈ అంశంపై భారతీ ఎయిర్‌టెల్‌ ఇంకా స్పందించలేదు.

ఇదీ చూడండి: సమస్యల పథంలోనే సాంకేతిక రథం

ABOUT THE AUTHOR

...view details