తెలంగాణ

telangana

ETV Bharat / business

జియోకు షాక్​- ఎయిర్​టెల్​ ఫుల్​ ఖుష్​!

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్​టెల్ వినియోగదారుల సంఖ్య జనవరిలో గణనీయంగా పెరిగింది. కొత్తగా 69 లక్షల మంది సబ్​స్క్రైబర్ల చేరికతో.. మొత్తం వినియోగదారుల సంఖ్య 33.6 కోట్లకు పెరిగింది. అదే సమయంలో జియో 34 లక్షల మంది యూజర్లను కోల్పోయింది.

Airtel adds 6.9 mn active users in Jan, extends gain: TRAI data
కొత్త వినియోగదారుల సంఖ్యలో ఎయిర్​టెల్​ ముందంజ

By

Published : Mar 21, 2021, 4:46 PM IST

టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్​ యాక్టివ్​ సబ్​స్క్రైబర్స్ సంఖ్య జనవరిలో 69 లక్షల మేర పెరిగింది. అదే సమయంలో జియో క్రియాశీల వినియోగదారుల సంఖ్య సుమారు 34 లక్షలు తగ్గింది. భారత టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ(ట్రాయ్‌) ఈమేరకు జనవరి గణాంకాలను ప్రకటించింది.

ట్రాయ్​ తాజా గణాంకాల ప్రకారం.. యాక్టివ్​ వినియోగదారుల సంఖ్యలో ఎయిర్​టెల్​, జియో మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. మొత్తంగా జనవరి నాటికి ఎయిర్​టెల్ క్రియాశీల వినియోగదారుల సంఖ్య 33.6 కోట్లకు ఎగసింది. మరోవైపు జియోకు 32.5 కోట్ల మంది యాక్టివ్​ వినియోగదారులు ఉన్నారు.

గతేడాది నవంబర్​, డిసెంబర్​లో 86 లక్షల మంది నూతన వినియోగదారులు జియో నెట్​వర్క్​లో చేరగా.. జనవరిలో మాత్రం గణనీయంగా తగ్గిందని జేఎం ఫైనాన్షియల్​ నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలో రానున్న రోజులు జియోకు మరింత కీలకం కానున్నాయి.

మొత్తంగా చూస్తే.. 41.7కోట్ల మంది వినియోగదారులతో దేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థగా జియో నిలిచింది. 34.46 కోట్ల మందితో ఎయిర్​టెల్​ రెండో స్థానంలో నిలిచింది. జనవరిలో 17 లక్షల కొత్త వినియోగదారుల చేరికతో వోడాఫోన్​-ఐడియా యూజర్ల సంఖ్య 28.9కోట్లకు పెరిగింది.

ఇదీ చదవండి:నాలుగు నెలల్లో రెండుకోట్ల చందాదారులు హాంఫట్!

ABOUT THE AUTHOR

...view details