తెలంగాణ

telangana

ETV Bharat / business

గాలిని శుద్ధి చేసే యంత్రం విడుదల - మార్కెట్ లోకి గాలిని శుద్ధి చేసే యంత్రం

కార్యాలయాల్లో గాలిని వైరస్ రహితంగా చేసే పరికరాన్ని విడుదల చేసింది హైదరాబాద్​కు చెందిన ఓ అంకుర సంస్థ. ఈ పరికరంతో గాలిలో ఉండే హానికర వైరస్‌లను కట్టడి చేసి నిర్మూలించవచ్చని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

Air purifier into the market
మార్కెట్ లోకి గాలిని శుద్ధి చేసే యంత్రం

By

Published : May 23, 2021, 7:23 AM IST

వ్యాపార సంస్థలు, కార్యాలయాల్లో గాలిని వైరస్‌ రహితం చేసే పరికరాన్ని హైదరాబాద్‌కు చెందిన అంకుర సంస్థ తారాడిడిల్‌ డిజిటల్‌ ఎల్‌ఎల్‌పీ విడుదల చేసింది. వోల్ఫ్‌ ఎయిర్‌ పేరుతో రూపొందించిన ఈ ఎయిర్‌ మాస్క్‌ పరికరం సెకనుకు 100 ట్రిలియన్‌ నెగెటివ్‌ ఆయాన్లను విడుదల చేస్తుంది. దీంతో గాలిలో ఉండే హానికర వైరస్‌లాంటి సర్ఫేస్‌ ప్రొటీన్‌, స్పైక్‌ ప్రొటీన్‌ను కట్టడి చేయడం ద్వారా, వాటిని నిర్మూలిస్తుందని సంస్థ ప్రతినిధి జగదీశ్‌ తెలిపారు.

ఈ పరికరం గాలిలో 99.9శాతం వైరస్‌లను నిర్మూలిస్తుందని ఐసీఎంఆర్‌ గుర్తింపు పొందిన లేబొరేటరీ పరీక్షల్లో తేలిందని జగదీశ్ అన్నారు. ఏసీలు ఉపయోగించే గదుల్లో దీని అవసరం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. 500 చదరపు అడుగుల గదికి అయితే రూ.19,500, 1000 చ.అ.కు అయితే రూ.29,500 చొప్పున ఇది లభిస్తుందన్నారు.

ఇదీ చూడండి:'ఆగస్టు నుంచి భారత్‌లోనే 'స్పుత్నిక్​-వి' ఉత్పత్తి'

ABOUT THE AUTHOR

...view details