తెలంగాణ

telangana

ETV Bharat / business

'వీఆర్​ఎస్​'కు ఎయిరిండియా సంఘాల డిమాండ్ - నేడు రెండో దఫా చర్చలు జరపనుంది కేంద్రం.

ఎయిర్ఇండియా ప్రైవేటీకరణకు కసరత్తు ముమ్మరమైన నేపథ్యంలో.. సంస్థ కార్మిక సంఘాలతో నేడు రెండో దఫా చర్చలు జరపనుంది కేంద్రం. విమానయాన శాఖ సహాయ మంత్రి హర్దీప్​ సింగ్​ పురీ నేతృత్వంలో ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ ప్రతిపాదనను యూనియన్లు.. కేంద్రం ముందుంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Air India Unions Demand For 'VRS'
'వీఆర్​ఎస్​'కు ఎయిర్​ఇండియా యూనియన్ల డిమాండ్!

By

Published : Jan 20, 2020, 5:41 AM IST

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్​ ఇండియా కార్మిక సంఘాలు.. పౌర విమానయాన శాఖ సహాయమంత్రి హర్దీప్ సింగ్​ పురీతో ఇవాళ సమావేశం కానున్నాయి. ఈ భేటీలో ట్రేడ్​ యూనియన్లు తమకు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్​ఎస్​) ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రెండోసారి..

ఎయిర్ఇండియా ప్రైవేటీకరణకు కసరత్తు ముమ్మరమైన నేపథ్యంలో.. సంస్థ ట్రేడ్ యూనియన్లతో వరుస చర్చలు జరుపుతున్నారు ​పురీ. ఇందులో భాగంగా ఈ నెలలో నేడు రెండో సారి సమావేశం కానున్నారు. భారీ అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్ఇండియాను గట్టెక్కించేందుకు తమ ముందున్న ఏకైక మార్గం 100 శాతం వాటాను ప్రైవేటు సంస్థలకు విక్రయించడం మాత్రమేనని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కారణంగా ప్రైవేటీకరణకు సంస్థ ఉద్యోగుల మద్దతు కోసం.. ఈ నెల 2న సంస్థ యూనియన్లతో తొలి దఫా చర్చలు జరిపింది.

వీఆర్​ఎస్​ డిమాండ్ అందుకే..

ప్రభుత్వంతో తొలి దఫా చర్చలు జరిపినప్పుడు.. ఉద్యోగ భద్రత కల్పించమని మాత్రమే కోరామని.. అప్పుడు వీఆర్​ఎస్​ గురించి ఆలోచించలేదని ట్రేడ్​ యూనియన్ వర్గాలు వెల్లడించాయి. అయితే చర్చల అనంతరం.. కొంత మంది యూనియన్​ సభ్యులు సంస్థ ప్రైవేటీకరణ తర్వాత ఒక సంవత్సరం వరకు మాత్రం ఉద్యోగ భద్రత ఉండొచ్చని.. అందువల్ల 'వీఆర్ఎస్​' గురించి చర్చించాలనే ప్రతిపాదనను తీసుకువచ్చినట్లు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో సమావేశంలో వీఆర్​ఎస్ డిమాండ్​ను ప్రభుత్వం ముందు ఉంచనున్నట్లు పేర్కొన్నాయి.

సంస్థ ప్రైవేటీకరకణ ఎందుకంటే..

2018-19 ఆర్థిక సంవత్సరానికి ఎయిర్​ ఇండియా రూ.8,556 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. మొత్తం రూ.80వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన కంపెనీని ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం చాలా రోజులుగా సన్నాహాలు చేస్తోంది.

పూర్తి వాటా విక్రయం..

తొలుత 76 శాతం ఈక్విటీ వాటా విక్రయానికి కేంద్రం 2018లో ప్రతిపాదించగా.. ఎవరూ ముందుకు రాలేదు. ఈ కారణంగా 2019లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను తిరిగి ప్రారంభించింది. ఈసారి ఎయిర్​ ఇండియా పూర్తి వాటా విక్రయానికి ప్రభుత్వం నిర్ణయించింది.

ఇదీ చూడండి:పద్దు: ప్రకటనలు ఎన్నెన్నో.. అమలైనవి కొన్నే

ABOUT THE AUTHOR

...view details