తెలంగాణ

telangana

ఏప్రిల్​ 30 వరకు ఎయిర్​ఇండియా బుకింగ్స్​ లేవు

By

Published : Apr 4, 2020, 6:04 AM IST

ఈ నెలాఖరు వరకు ఎలాంటి బుకింగ్స్​ తీసుకోబోమని ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్​ఇండియా స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్త లాక్​డౌన్ ఈ నెల14తో ముగియనుంది. అయితే ఆ తర్వాత ప్రభుత్వ నిర్ణయం ఏంటనేది తెలుసుకున్నాకే బుకింగ్స్​పై నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించింది.

Airindia
ఎయిర్​ఇండియా

దేశ వ్యాప్త లాక్‌డౌన్‌ ఈ నెల 14 వరకు కొనసాగనుంది. ఆ తర్వాత కూడా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందో వేచి చూడాలని ఎయిర్​ఇండియా భావిస్తోంది. అందుకే ఏప్రిల్‌ 30 వరకు దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో బుకింగ్‌లు తీసుకోవడం లేదని సంస్థ తెలిపింది.

ప్రైవేటు సంస్థలు ఏమంటున్నాయి?

ఇండిగో, స్పైస్‌జెట్‌, గోఎయిర్‌ వంటి ప్రైవేటు సంస్థలు మాత్రం ఏప్రిల్‌ 15 నుంచే దేశీయ మార్గాల్లో ప్రయాణానికి టికెట్లు విక్రయిస్తున్నట్లు తెలిపాయి. అంతర్జాతీయ మార్గాల్లో ప్రయాణానికి మే 1 నుంచి బుకింగ్‌లు తీసుకుంటున్నట్లు స్పైస్‌జెట్‌, గోఎయిర్‌ ప్రకటించాయి. ఏప్రిల్‌ 15 నుంచి టికెట్ల బుకింగ్‌ తీసుకుంటున్నట్లు విస్తారా తెలిపింది. ఏప్రిల్‌ 14 తర్వాత విమాన సంస్థలు బుకింగ్‌లు మొదలుపెట్టుకోవచ్చని పౌర విమానయాన కార్యదర్శి ప్రదీప్‌ సింగ్‌ ఖరోలా ప్రకటించడం గమనార్హం.

ఇదీ చూడండి:లాక్​డౌన్​ వేళ మనుషుల కదలికల్లో ఇంత మార్పా!

ABOUT THE AUTHOR

...view details