అప్పులభారం దృష్ట్యా ఎయిర్ ఇండియాను ప్రైవేటుపరం చేయక తప్పదని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పూరి స్పష్టంచేశారు. ఈ విషయమై చర్చలు జరుగుతున్నట్లు ఆయన చెప్పారు. ప్రైవేటీకరణ ప్రక్రియ రెండేళ్లక్రితమే ప్రారంభమైందన్నారు. ఏదో ఒక స్వదేశీ సంస్థ ఎయిర్ ఇండియాను కొనాలని కోరుకుంటున్నట్లు చెప్పారు కేంద్ర మంత్రి.
ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ఖాయం: హర్దీప్
ఎయిర్ ఇండియాను ప్రైవేటుపరం చేయబోతున్నట్లు ప్రకటించారు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్. అప్పుల భారం దృష్ట్యా మరో దారి లేదని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ రెండేళ్ల క్రితమే ప్రారంభమైందని వెల్లడించారు.
ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ఖాయం: హర్దీప్
ఎయిర్ ఇండియాకు రూ.26వేల కోట్ల అప్పులు ఉన్నట్లు వెల్లడించారు హర్దీప్. ప్రైవేటీకరణకు సంబంధించి త్వరలోనే ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు.