అప్పుల్లో కూరుకుపోయిన ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ప్రక్రియ ఇప్పట్లో పుర్తి అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. వచ్చే ఆర్థిక సంవత్సరం వరుకు ఇది కొనసాగుతుందని సంబంధిత అధికారులు తెలిపారు. కొనుగోలుకు ఆసక్తి వ్యక్తీకరణ(ఈఓఐ) బిడ్లను దాఖలు చేసిన వారి వివరాలు జనవరి 6న వెల్లడవుతాయన్నారు. టాటా గ్రూప్, అమెరికాకు చెందిన ఫండ్ ఇంటరప్స్ సంస్థలు.. బిడ్లు దాఖలు చేసిన వాటిలో ఉన్నాయి. బిడ్లకు అనుమతి పొందిన వారికి ఎయిర్ ఇండియాకు చెందిన వర్చువల్ డేటా రూమ్(వీడీఆర్)కు అనుమతి లభిస్తుందని అధికారులు తెలిపారు. బిడ్లు దాఖలు చేసిన వారు సందేహాలను నివృత్తి చేసుకుంటారు కాబట్టి ప్రైవేటీకరణ ప్రక్రియ ఆలస్యం అవుతుందని అభిప్రాయపడ్డారు.
ఆది నుంచి నష్టాల్లో
ఎయిర్ ఇండియా సంస్థ 2007 నుంచి నష్టాల్లో కొనసాగుతోంది. దీంతో 100శాతం వాటాను విక్రయించేందుకు సిద్ధపడింది. కరోనా వల్ల సంస్థ విక్రయానికి గడువును పదే పదే పొడగిస్తూ వచ్చింది ప్రభుత్వం. డిసెంబరు 14 గడువు ముగిసే సమయానికి అమెరికాకు చెందిన ఫండ్ ఇంటరప్స్ సంస్థతో కలిసి 200 మంది ఎయిర్ ఇండియా ఉద్యోగులు ఈఓఐ పత్రాలు సమర్పించారు.