తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎయిర్​ ఇండియాలో భారీ స్థాయిలో డేటా లీక్!

భారత విమానయాన సంస్థ ఎయిర్​ ఇండియా ప్యాసింజర్ల డేటా భారీ స్థాయిలో లీకైంది. సైబర్​ దాడిలో 4.5 మిలియన్​ ప్యాసింజర్ల వ్యక్తిగత సమాచారం హ్యాకైనట్లు సంస్థ పేర్కొంది.

AIR INDIA
ఎయిర్ ఇండియా

By

Published : May 22, 2021, 12:08 AM IST

Updated : May 22, 2021, 4:43 AM IST

ఎయిర్ ఇండియా.. తమ విమాన ప్రయాణికుల కోసం నిర్వహిస్తున్న సితా వెబ్‌సైట్‌ నుంచి భారీగా సమాచార చోరీ జరిగినట్లు గుర్తించింది. వెబ్‌సైట్‌పై ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో అత్యాధునిక సైబర్‌ దాడి జరిగినట్లు ఎయిరిండియా ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది.

2011 ఆగస్టు 11 నుంచి 2020 ఫిబ్రవరి 3 వరకు నమోదు చేసుకున్న ప్రయాణికుల పేర్లు, పుట్టిన తేదీ, చిరునామా, పాస్‌పోర్ట్, టిక్కెట్టు, క్రెడిట్‌ కార్డుల సమాచారం లీకైనట్లు వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా 45లక్షల మంది ప్రయాణికుల వ్యక్తిగత సమాచారంపై ఈ సైబర్ దాడి ప్రభావం పడిందని ఎయిర్​ ఇండియా తెలిపింది. ఫోరెన్సిక్‌ విశ్లేషణ ద్వారా ఈ అత్యాధునిక దాడి స్ధాయి, తీవ్రతను పరిశీలిస్తున్నామని, సితా సర్వీస్‌ ప్రొవైడర్‌ వ్యవస్ధలోని మౌలిక సదుపాయాల్లో ఎలాంటి అక్రమ కార్యకలాపాలను గుర్తించలేదని వెల్లడించింది. నష్టం తీవ్రతను అంచనా వేయడం సహా తదుపరి చర్యలను తీసుకున్నట్లు తెలిపింది.

ఇదీ చదవండి:యాంటీబాడీల నిర్ధరణకు డీఆర్​డీఓ 'కిట్​'

Last Updated : May 22, 2021, 4:43 AM IST

ABOUT THE AUTHOR

...view details