ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా.. విమాన సేవల పునరుద్ధరణపై కీలక ప్రకటన చేసింది. ఎంపిక చేసిన పలు దేశీయ మార్గాల్లో మే 4 నుంచి, అంతర్జాతీయ ప్రయాణాలకు జూన్ 1 నుంచి సర్వీసులు నడపనున్నట్లు తెలిపింది. ఇందుకోసం బుకింగ్‌లు ప్రారంభించినట్లు సంస్థ వెబ్‌సైట్‌లో పేర్కొంది.
మే 4 నుంచి ఎయిర్ ఇండియా విమాన సేవలు - లాక్‌డౌన్ వార్తలు
కరోనా వైరస్ నేపథ్యంలో నిలిచిపోయిన విమానయాన సేవల పునరుద్ధరణకు కసరత్తు చేస్తోంది ఎయిర్ ఇండియా. లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత మే 4 నుంచి దేశీయ ప్రయాణాలకు (ఎంపిక చేసిన రూట్లలో) సర్వీసులు నడపనున్నట్లు తెలిపింది.
ఎయిర్‌ఇండియా
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 25 నుంచి దేశవ్యాప్త లాక్‌డౌన్ కొనసాగుతోంది. మే 3వరకు ఇదే పరిస్థితి ఉండనుంది. ఈ కారణంగా అన్ని రకాల ప్యాసింజర్ విమానాలు నేలకే పరిమితమయ్యాయి.
ఇదీ చూడండి:కరోనా కాలంలోనూ ఈ వ్యాపారాల్లో జోష్