తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎయిర్​ఇండియా కోసం కొత్త విమానాలు..! - ఎయిర్​ఇండియా కోసం కొత్త విమానాలు

Air India New Flights: ఎయిర్​ఇండియాలో కొత్త విమానాలను ప్రవేశపెట్టాలని టాటా సంస్థ యోచిస్తోంది. ఈ మేరకు ఎయిర్‌బస్‌, బోయింగ్‌ల సంస్థలతో టాటా సంస్థ సంప్రదింపులు జరుపుతోంది.

new flights to come for air india
ఎయిర్​ఇండియా కోసం కొత్త విమానాలు

By

Published : Feb 26, 2022, 5:55 AM IST

Air India New Flights: తమ ఆధీనంలోకి వచ్చిన విమానయాన సంస్థ ఎయిరిండియాకు కొత్త విమానాలు సమకూర్చేందుకు, పాత వాటిని తీర్చిదిద్దేందుకు యాజమాన్య సంస్థ టాటా ట్యాలెస్‌ చర్యలు ప్రారంభించింది.

దాదాపు 7 దశాబ్దాల పాటు ప్రభుత్వరంగంలో ఉన్న ఎయిరిండియాకు దేశ, విదేశాల్లో ఆకర్షణీయ ల్యాండింగ్‌ స్లాట్లు ఉన్నాయి. అయితే సంస్థ వద్ద ఉన్న విమానాలు ఏళ్ల తరబడి వినియోగించినవి కావడంతో పాటు, కొన్నింటిని మెరుగు పరచడంతో పాటు మరికొన్ని కొత్త విమానాలను ప్రవేశ పెట్టాలన్నది టాటాల ఆలోచన. దీంతోపాటు సంస్థ ఆర్థిక పరిస్థితులను, సేవల స్థాయిని కూడా మెరుగుపరచాల్సి ఉంది.

ఈ ప్రణాళికలో భాగంగానే విమాన తయారీ సంస్థలైన బోయింగ్‌, ఎయిర్‌బస్‌ ప్రతినిధులతో పాటు విమానాలు లీజుకు ఇచ్చిన సంస్థలతోనూ ఇటీవల టాటా గ్రూప్‌ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎయిరిండియా వద్ద 140కి పైగా ఎయిర్‌బస్‌, బోయింగ్‌ విమానాలున్నాయి.

వీటిని కొత్తవాటిలా తీర్చిదిద్దేందుకు టాటాలకు 100 కోట్ల డాలర్ల (సుమారు రూ.7,500 కోట్లు)కు పైగా వ్యయం అవుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ అంశంపై విమాన తయారీ సంస్థలతో పాటు టాటాలు కూడా స్పందించలేదు.

ఇదీ చూడండి:చిత్ర కురులు మెచ్చిన 'హిమాలయన్​ యోగి' అతడే.. తెలిసిపోయిందిగా!

ABOUT THE AUTHOR

...view details