తెలంగాణ

telangana

ETV Bharat / business

'మోదీ జీ.. మాకు రూ.50 వేల కోట్ల సాయం కావాలి' - AIR INDIA

సంక్షోభంలో చిక్కుకున్న ఎయిర్ ఇండియాకు కేంద్ర ప్రభుత్వం రూ.50 వేల కోట్ల మేర ఆర్థికసాయం అందించాలని ఆ సంస్థ ఉద్యోగులు, స్టాఫ్ యూనియన్ల సంయుక్త ఫోరం కోరింది. కరోనా సంక్షోభం, లాక్​డౌన్​ సమయంలో ఎయిర్​ ఇండియా దేశానికి గొప్ప సేవ చేసిందని గుర్తు చేసింది.

Air India employee unions seek Rs 50,000 cr financial package for flag carrier
ఎయిర్ ఇండియాకు రూ.50,000 కోట్లు సాయం కావాలి

By

Published : May 28, 2020, 5:34 PM IST

కేంద్ర ప్రభుత్వం ఎయిర్ ఇండియాకు రూ.50 వేల కోట్ల మేర ఆర్థిక సాయం అందించాలని... ఆ సంస్థ ఉద్యోగులు, స్టాఫ్ యూనియన్ల సంయుక్త ఫోరం కోరింది. ప్రధానమంత్రికి రాసిన లేఖలో... దేశానికి ఎంతో సేవ చేస్తున్న ఎయిర్​ ఇండియాను సంక్షోభం నుంచి కాపాడుకోవాల్సిన అవసరముందని పేర్కొంది.

"ప్రభుత్వం ఆర్థిక ఉద్దీపనలు ప్రకటిస్తే... అవి ఎయిర్ ఇండియా సంస్థకు మాత్రమే కాకుండా మొత్తం వినానయాన రంగానికి, ఆర్థిక వ్యవస్థకు కూడా చేయూతనందిస్తాయి. కనుక ప్రస్తుత పరిస్థితుల్లో విమానయాన పరిశ్రమను ప్రోత్సహించడం, సాధారణ కార్యకలాపాలను పునరుద్ధరించడం అత్యవసరం. "

- ఎయిర్ ఇండియా ఉద్యోగుల సంయుక్త ఫోరం

రిస్క్ చేశాం...

'కరోనా సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులు నిలిచిపోయాయి. అలాంటి సమయంలోనూ ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను.. ఎయిర్ ఇండియానే స్వదేశానికి తీసుకొచ్చింది. కరోనాకు పుట్టినిల్లు అయిన వుహాన్​ నుంచి కూడా భారత పౌరులను వెనక్కు తీసుకొచ్చింది. అలాగే భారత్​ నుంచి వివిధ దేశాలకు.... ఔషధాలు, వైద్య పరికరాలను ఎగుమతి, దిగుమతులు చేసింది. అయితే ఆ సమయంలో ఎయిర్ ఇండియా సిబ్బంది వ్యక్తిగత (రిస్క్​) ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. ఎయిర్ ఇండియా ఎల్లప్పుడూ దేశ సేవ కోసం పనిచేసింది. ముఖ్యంగా సంక్షోభ సమయంలో తన విధులను ఎంతో సమర్థవంతంగా నిర్వహించింది' - ఎయిర్ ఇండియా ఉద్యోగుల సంయుక్త ఫోరం

కరోనా సంక్షోభం, లాక్​డౌన్​ వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల కోట్లతో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించింది. పలురంగాలకు కేటాయింపులు కూడా చేసింది.

ఇదీ చూడండి:బ్యాంకింగ్ షేర్ల అండతో మార్కెట్లలో జోష్​

ABOUT THE AUTHOR

...view details