కరోనా నేపథ్యంలో ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా తన ఉద్యోగులకు వేతనం లేని సెలవులను మంజూరు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు ఈ సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ సెలవులను గరిష్ఠంగా ఐదేళ్ల వరకు పొడిగించే విధంగా ప్రణాళికలు రూపొందించింది.
ఉద్యోగుల సామర్థ్యం, పనితీరు, ఆరోగ్యం వంటి అంశాలను బట్టి ఈ సెలవులు మంజూరు చేసే అధికారం ఎయిరిండియా సీఎండీ రాజీవ్ బన్సల్‌కు ఇస్తున్నట్లు సంస్థ తన లేఖలో పేర్కొంది. సిబ్బంది, ఆర్థిక విభాగాల జనరల్ మేనేజర్లు, డిపార్ట్మెంట్ హెడ్‌తో కూడిన కమిటీని ప్రాంతీయ డైరెక్టర్ ఏర్పాటు చేస్తారని ఎయిరిండియా తెలిపింది. సెలవులు కావాలనుకునే ఉద్యోగుల వివరాలను సీఎండీ అనుమతి కోసం ప్రధాన కార్యాలయానికి పంపించాలని పేర్కొంది.
"ప్రధాన కార్యాలయంలోని డిపార్ట్‌మెంటల్ హెడ్‌లు, ప్రాంతీయ డైరెక్టర్లు పైన పేర్కొన్న అంశాల ఆధారంగా ఉద్యోగులను ఎంపిక చేసి.. వారి వివరాలను సీఎండీ ఆమోదం కోసం పంపించాలి.
-ఎయిరిండియా