తెలంగాణ

telangana

ETV Bharat / business

వ్యాక్సిన్‌ రవాణాకు ఎయిర్‌ఫ్రైట్‌ కారిడార్‌ - హైదరాబాద్‌-దుబాయ్‌ గ్లోబల్‌ వ్యాక్సిన్‌ కారిడార్‌ పేరిట ప్రత్యేక వ్యాక్సిన్‌ ఎయిర్‌ఫ్రైట్‌ కారిడార్

హైదరాబాద్‌లో వ్యాక్సిన్‌ డోసులు అధికంగా ఉత్పత్తి చేయనుండటంతో, విమానాల్లో రవాణాకు జీఎంఆర్‌ హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాట్లు చేస్తోంది. జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు లిమిటెడ్‌, జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఎయిర్‌కార్గో, దుబాయి విమానాశ్రయాల మధ్య కీలక ఒప్పందం జరిగింది. భారత్‌లో వ్యాక్సిన్ల ఎగుమతి, దిగుమతి పరంగా, దేశీయంగా పంపిణీ విషయంలో అతిపెద్ద ఎయిర్‌కార్గో కేంద్రంగా హైదరాబాద్ అవతరించినట్లు చెప్పారు.

Air Freight Corridor for Vaccine Transport
వ్యాక్సిన్‌ రవాణాకు ఎయిర్‌ఫ్రైట్‌ కారిడార్‌

By

Published : Jan 5, 2021, 7:59 AM IST

కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను ప్రపంచంలోని వివిధ దేశాలకు రవాణా చేసేందుకు గగనతల రవాణా సంస్థలు సిద్ధమవుతున్నాయి. హైదరాబాద్‌లో వ్యాక్సిన్‌ డోసులు అధికంగా ఉత్పత్తి చేయనుండటంతో, విమానాల్లో రవాణాకు జీఎంఆర్‌ హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు లిమిటెడ్‌, జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఎయిర్‌కార్గో, దుబాయి విమానాశ్రయాల మధ్య సోమవారం కీలక ఒప్పందం జరిగింది.

హైదరాబాద్‌-దుబాయ్‌ గ్లోబల్‌ వ్యాక్సిన్‌ కారిడార్‌ పేరిట ప్రత్యేక వ్యాక్సిన్‌ ఎయిర్‌ఫ్రైట్‌ కారిడార్‌ఏర్పాటు చేస్తున్నట్లు ఆయా సంస్థలు ప్రకటించాయి. ఇందుకు సంబంధించి జీఎంఆర్‌ హైదరాబాద్‌ విమానాశ్రయ సీఈవో ప్రదీప్‌ ఫణికర్‌, హైదరాబాద్‌ ఎయిర్‌కార్గో సీఈవో సౌరభ్‌కుమార్‌, దుబాయ్‌ ఎయిర్‌పోర్టు వాణిజ్య విభాగం ఈవీపీ యూజిస్‌ భారీ ఒప్పందాలపై సంతకాలు చేశారు.

అతిపెద్ద ఎయిర్‌కార్గో కేంద్రంగా హైదరాబాద్​

వివిధ ఖండాలకు వ్యాక్సిన్‌ రవాణాకు ఇవి ప్రాధాన్యం ఇస్తాయి. నియంత్రిత పద్ధతిలో వ్యాక్సిన్‌ తయారీ కేంద్రాల నుంచి విమానాశ్రయం, అక్కడి నుంచి లాజిస్టిక్స్‌ హబ్‌కు, తదుపరి వినియోగదారులకు చేరేవరకు ప్రత్యేక దృష్టి పెడతాయి. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌ సరఫరాకు దుబాయ్‌ ఎయిర్‌పోర్టును కీలక కేంద్రంగా జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు గుర్తించింది.వ్యాక్సిన్‌ రవాణాకు శీతలం నుంచి అతిశీతల ఉష్ణోగ్రతల పరిధి పెంచుతున్నట్లు ప్రదీప్‌ వెల్లడించారు. దీని ద్వారా భారత్‌లో వ్యాక్సిన్ల ఎగుమతి, దిగుమతి పరంగా, దేశీయంగా పంపిణీ విషయంలో అతిపెద్ద ఎయిర్‌కార్గో కేంద్రంగా అవతరించినట్లు చెప్పారు. ఆటంకాలు లేని సరఫరాకు వ్యాక్సిన్‌ ఎయిర్‌ఫ్రైట్‌ కారిడార్‌ ఉపయోగపడుతుందని జీఎంఆర్‌ గ్రూపు చీఫ్‌ ఇన్నోవేషన్‌ అధికారి, ఈడీ ఎస్‌.జి.కె.కిశోర్‌ తెలిపారు.

ఇదీ చూడండి:ఫోర్డ్‌ 2021 ఎకోస్పోర్ట్-‌ ధర ఎంతో తెలుసా?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details