తెలంగాణ

telangana

ETV Bharat / business

సెప్టెంబరు నాటికి మోదీకి కొత్త విమానాలు!

ప్రధాని నరేంద్ర మోదీ సహా ఇతర అగ్రశ్రేణి నేతల ప్రయాణం కోసం బోయింగ్ సంస్థ ప్రత్యేకంగా తయారు చేస్తున్న రెండు విమానాలు సెప్టెంబరు నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశముంది. వీటిని ఎయిర్​ ఇండియాకు బదులు... భారత వాయుసేన పైలట్లు నడపనున్నారు.

By

Published : Jun 8, 2020, 4:13 PM IST

AI likely to get custom-made B777 planes for VVIP travel by September
సెప్టెంబరు నాటికి భారత్​ చేరుకోనున్న మోదీ ప్రత్యేక విమానం

అత్యంత ప్రముఖుల కోసం అమెరికాకు చెందిన బోయింగ్​ సంస్థతో తయారు చేయిస్తున్న రెండు ప్రత్యేక విమానాలు సెప్టెంబరు నాటికి భారత్​కు వస్తాయని అధికారులు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా ఇతర అగ్రనేతలు, ఉన్నతాధికారులు ప్రయాణించేందుకు వీటిని ఉపయోగించనున్నారు.

వాస్తవానికి ఈ విమానాలను బోయింగ్ జులైలోనే డెలివరీ చేయాల్సి ఉంది. కొవిడ్​-19 సంక్షోభం కారణంగా సకాలంలో రాలేకపోయినట్లు అధికారులు చెప్పారు. ఈ రెండు బీ777 విమానాలను భారత వాయుసేన పైలట్లు ఆపరేట్ చేస్తారు. వీటి నిర్వహణ బాధ్యత మాత్రం ఎయిర్ ఇండియాదే.

747 నుంచి 777కు...

ప్రధాని, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ప్రస్తుతం బీ747 విమానాల్లో ప్రయాణిస్తున్నారు. ఇది 'ఎయిర్ ఇండియా వన్​' గుర్తును కలిగి ఉంటుంది. ఎయిర్ ఇండియా పైలట్లే వీటిని ఆపరేట్​ చేస్తున్నారు.

బోయింగ్​ తయారు చేస్తున్న బీ777 విమానాల్లో అత్యాధునిక రక్షణ వ్యవస్థ, సెల్ఫ్​ ప్రొటెక్షన్​ సూట్లను ఉపయోగించనున్నారు. రెండు రక్షణ వ్యవస్థలను 190 మిలియన్​ డాలర్లకు విక్రయించేందుకు అమెరికా ఫిబ్రవరిలో అంగీకరించింది.

ABOUT THE AUTHOR

...view details