రబీ పంట ఉత్పత్తి గతేడాది కన్నా ఎక్కువ ఉంటుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆశాభావం వ్యక్తం చేశారు. 2020-21 రబీ పంట కాలంలో వచ్చిన 15.3 కోట్ల టన్నుల కన్నా ఎక్కువ దిగుబడి వస్తుందని అభిప్రాయపడ్డారు.
వ్యవసాయ రంగం భేష్..
కొవిడ్ పరిస్థితులను లక్ష్యపెట్టకుండా రైతులు సాగు చేశారని, 2020 ఖరీఫ్ పంటకు మంచి దిగుబడి లభించిందన్నారు. కేంద్రం ప్రవేశ పెట్టిన సాగు చట్టాలు, పదివేల ఎఫ్పీఓ (ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ )ల ఏర్పాటు, సాగు రంగంలో మౌలిక సదుపాయాలకు లక్షల కోట్ల కేటాయింపు.. రైతులకు మేలు చేస్తాయన్నారు.