రిలయన్స్- జియోలో విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. అబుదాబి పెట్టుబడుల సంస్థ ఏఐడీఏ రూ. 5,683 కోట్లు వెచ్చించి.. 1.16 శాతాన్ని కొనుగోలు చేసింది. ఈ మేరకు రిలయన్స్ జియో ఓ ప్రకటనలో తెలిపింది.
జియోలో అబుదాబి సంస్థ వేల కోట్ల పెట్టుబడులు - జియోలో భాగస్వామియైన మరో విదేశీ సంస్థ
భారత టెలికాం దిగ్గజం రిలయన్స్ జియోలో విదేశీ పెట్టుబడుల పర్వం కొనసాగుతోంది. తాజాగా అబుదాబి పెట్టుబడుల సంస్థ.. 1.16 శాతాన్ని కొనుగోలు చేసినట్లు జియో ప్రకటించింది.
జియోలో భాగస్వామియైన మరో విదేశీ సంస్థ
జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి వారం వ్యవధిలో ఇది ఎనిమిదో పెట్టుబడి. అయితే ఇప్పటివరకు మొత్తం రూ. 97,855.65 కోట్లు జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి వచ్చినట్లు సంస్థ అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి:'జియో'లో మరో కంపెనీ పెట్టుబడి పెట్టనుందా?