ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి అంచనాలను ఆసియా అభివృద్ధి బ్యాంకు 6.5 శాతానికి తగ్గించింది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి రేటు 6 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయిన నేపథ్యంలో ఈ అంచనాకు వచ్చినట్లు తెలిపింది.
"ఏప్రిల్-జూన్ మొదటి త్రైమాసికంలో భారత వృద్ధి 5 శాతానికి నెమ్మదించింది. అందుకే 2019 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి అంచనా 6.5 శాతానికి తగ్గింది. అయితే 2020 ఆర్థిక సంవత్సరంలో భారత్ 7.2 శాతం మేర వృద్ధి సాధించే అవకాశం ఉంది."
- ఆసియా అభివృద్ధి బ్యాంకు
ఈ జులైలో భారత జీడీపీ వృద్ధి అంచనాలను 2019-20 సంవత్సరానికిగానూ 7 శాతానికి తగ్గించింది ఏడీబీ. కొద్ది నెలలకే ఆ లెక్కలను సవరించింది.