కరోనా మహమ్మారిపై పోరులో భారత్‌కు అండగా నిలిచింది ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ). వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొవడానికి 1.5 బిలియన్ డాలర్లను కేటాయించినట్లు తెలిపింది.
కరోనాపై పోరులో భారత్‌కు ఏడీబీ ఆర్థిక సాయం - భారత్‌కు ఆర్థిక సాయం అందించిన ఏడీబీ
కొవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి 1.5 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు.
![కరోనాపై పోరులో భారత్‌కు ఏడీబీ ఆర్థిక సాయం ADB, ఏషియా డెవెలప్మెంట్ బ్యాంక్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11559199-thumbnail-3x2-adb.jpg)
కరోనా పోరులో భారత్‌కు ఏడీబీ ఆర్థిక సాయం
మహమ్మారిపై పోరాడటానికి 26 దేశాలకు ఆర్థిక సహాయం అందించడానికి ఏడీబీ గతేడాది ఏప్రిల్‌లో 20 బిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటివరకు 26 దేశాలకు వివిధ రూపాల్లో 16.1 బిలియన్ డాలర్ల మేర ఖర్చు చేసినట్లు తెలిపింది. ఇందులో భాగంగానే భారత్‌కు ఈ ఏడాది చివరి నాటికి.. కేటాయించిన మొత్తంను అందిస్తామని ఆ సంస్థ ప్రతినిధులు వివరించారు.
ఇదీ చూడండి:సభ్య దేశాలకు ఏడీబీ మరింత సాయం