వ్యాక్సిన్ కొనుగోలు కోసం భారత్‌కు రూ.11,185 కోట్ల రుణాన్ని ఆమోదించింది ఆసియా అభివృద్ధి బ్యాంకు(adb loan to india for covid-19). ఈ మేరకు గురువారం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్టిమెంట్ బ్యాంకు కూడా భారత్‌కు మరో రూ. 3,725 కోట్లను ఇవ్వనుందని సమాచారం. ఏడీబీ ఫండ్‌తో దాదాపు 31.7 కోట్ల మందికి సరిపోయే విధంగా 66.7 కోట్ల టీకా డోసులు భారత్ కొనుగోలు చేయగలదు.
'భవిష్యత్‌లో వైరస్ వ్యాప్తి నుంచి తమ పౌరులను రక్షించుకోవడానికి ఈ నిధి ఉపయోగపడనుంది. భారత్‌లో 18 ఏళ్ల పైనున్న 94.47 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించడానికి ఈ రుణం సహకరిస్తుంది. ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమైన కారణంగా టీకాలు చాలా కీలకంగా మారాయి.' అని ఏడీబీ అధ్యక్షుడు మసత్సుగు అసకవా తెలిపారు.