తెలంగాణ

telangana

ETV Bharat / business

'నెలరోజుల్లో కెనడాకు కొవిషీల్డ్​ అందిస్తాం' - సీరం సంస్థ కొవిడ్​ టీకా

కెనడాకు కొవిషీల్డ్​ టీకా అందించడంపై సీరం సంస్థ సీఈఓ అదర్​ పూనావాలా స్పందించారు. నెలలోగా కొవిషీల్డ్​ టీకా వస్తుందని కెనడా ప్రధాని జస్టిన్​ ట్రూడోకు హామీ ఇచ్చారు.

poonawala, covishield
నెలరోజుల్లో కెనడాకు కొవిషీల్డ్​ : పూనావాలా

By

Published : Feb 16, 2021, 7:11 AM IST

అస్ట్రాజెనెకా, ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీలు అభివృద్ధి చేసిన కరోనా టీకా కొవిషీల్డ్​ను నెల రోజుల్లోపే కెనడాకు పంపిస్తామని మనదేశంలో ఈ టీకాను తయారు చేస్తున్న సీరమ్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ ఇండియా (ఎస్​ఐఐ) పేర్కొంది. "భారత్​, భారత వ్యాక్సిన్​ పరిశ్రమపై మీరు (కెనడా ప్రధాని జస్టిన్​ ట్రూడో) చేసిన సానుకూల వ్యాఖ్యలకు కృతజ్ఞతలు. కెనడా నుంచి నియంత్రణపరమమైన అనుమతుల కోసం వేచిచూస్తున్నాం. నెలలోగా కొవిషీల్డ్​ కెనడాకు వస్తుందని హామీ ఇస్తున్నాన"ని ఎస్​ఐఐ సీఈఓ అదర్​ పూనావాలా ట్వీట్​ చేశారు.

కెనడా కోరినట్లు కరోనా టీకాల సరఫరాలో భారత్​ తన వంతు సహాయం చేస్తుందని కెనడా ప్రధాన మంత్రికి మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 10న హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. భారత్ ఇప్పటికే 229 లక్షల డోసుల కరోనా టీకాలను వివిధ దేశాలకు పంపిణీ చేసింది.

ఇదీ చదవండి :త్వరలో భారత అమ్ముల పొదిలోకి మరో క్షిపణి!

ABOUT THE AUTHOR

...view details