ఉద్యోగాల కల్పన, ఆదాయ పరంగా దేశంలో అతి పెద్ద రంగాల్లో ఒకటిగా ఆరోగ్య సంరక్షణ రంగం అవతరిస్తోందని నీతి ఆయోగ్ తెలిపింది. 2022 కల్లా ఈ రంగ పరిమాణం రూ.27 లక్షల కోట్లకు (372 బిలియన్ డాలర్లు) చేరే అవకాశం ఉందని నీతి ఆయోగ్ తెలిపింది. ఆసుపత్రులు, ఔషధాలు, వైద్య పరికరాలు, ఇంటి వద్దనే ఆరోగ్య సంరక్షణ సేవలు, కొత్త సాంకేతికతలు.. ఇలా పలు విభాగాల్లో పెట్టుబడులకు అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొంది.
రూ.27 లక్షల కోట్లకు ఆరోగ్య సంరక్షణ రంగం! - ఆరోగ్య సంరక్షణ రంగం
2017- 2022 వరకు ఏడాదికి ఐదు లక్షలకు పైగా.. మొత్తం 27 లక్షల ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యం ఆరోగ్య సంరక్షణ రంగానికి ఉందని తాజా నివేదికలో అభిప్రాయపడింది నీతి ఆయోగ్. ఉద్యోగాల కల్పన, ఆదాయ పరంగా దేశంలో అతి పెద్ద రంగాల్లో ఒకటిగా అవతరిస్తోందని తెలిపింది. 2017 నుంచి దాదాపు 22 శాతం వార్షిక వృద్ధి రేటుతో భారత ఆరోగ్య సంరక్షణ పరిశ్రమ వృద్ధి చెందుతోందని వెల్లడించింది.
ఆరోగ్య సంరక్షణ రంగం
2017- 2022 వరకు ఏడాదికి ఐదు లక్షలకు పైగా.. మొత్తం 27 లక్షల ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యం ఈ రంగానికి ఉందని తన నివేదికలో నీతి ఆయోగ్ అభిప్రాయపడింది. 2017 నుంచి దాదాపు 22 శాతం వార్షిక వృద్ధి రేటుతో భారత ఆరోగ్య సంరక్షణ పరిశ్రమ వృద్ధి చెందుతోందని తెలిపింది. 2011లో దేశీయ ఆరోగ్య సంరక్షణ రంగంలోకి 9.4 కోట్ల డాలర్ల ఎఫ్‌డీఐలు రాగా.. 2016లో 127.50 కోట్ల డాలర్లు వచ్చాయి. అంటే 13.5 రెట్లు పెరిగాయన్నమాట.
- ఆరోగ్య సంరక్షణ విపణిలో 80 శాతం వాటా ఆసుపత్రి విభాగానిదే. 2016-17లో ఈ విభాగ విలువను 61.79 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టగా.. 2023లో ఇది 132 బిలియన్ డాలర్లకు చేరొచ్చని నివేదిక అంచనా వేసింది.
- దేశ జనాభాలో 50 శాతం వరకు ఉన్న ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ ప్రజలకు దాదాపు 65 శాతం ఆసుపత్రి పడకలు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన 50 శాతం మంది జనాభా ఉన్న 21 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రజలకు 35 శాతం మాత్రమే పడకలు అందుబాటులో ఉన్నాయి. ఈ లెక్కన ఆసుపత్రి పడకల సంఖ్యను కనీసం 30 శాతమైనా పెంచుకునే అవకాశాలు ఉన్నాయి.
ఇదీ చదవండి:'భారత్లోని 52% కంపెనీలపై సైబర్ దాడులు'