తెలంగాణ

telangana

ETV Bharat / business

డిసెంబరు నాటికి 50% మంది కార్యాలయాలకు! - Work from home

చిన్న కంపెనీల్లో ఇప్పటికే 20శాతం ఉద్యోగులు కార్యలయాలకు హాజరవుతున్నారు. ఈ సంఖ్య డిసెంబరు నాటికి ఇది 50 శాతానికి చేరుకుంటుందని హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ (హైసియా) నిర్వహించిన 'ఫ్యూచర్‌ వర్క్‌ మోడల్స్‌' సర్వేలో తేలింది.

Work from home
వర్క ఫ్రమ్​ హోం

By

Published : Aug 4, 2021, 7:56 AM IST

కొవిడ్‌-19 నేపథ్యంలో ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు రప్పించేందుకు ఐటీ సంస్థలు ప్రయత్నాలు ప్రారంభించాయి. మొత్తం ఐటీ ఉద్యోగుల్లో ప్రస్తుతం 5 శాతం మంది ఆఫీసులకు వస్తుండగా, డిసెంబరు నాటికి ఇది 50 శాతానికి చేరుకోవాలని కంపెనీలు ఆశిస్తున్నాయని హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ (హైసియా) నిర్వహించిన 'ఫ్యూచర్‌ వర్క్‌ మోడల్స్‌' సర్వేలో తేలింది. 500 మంది ఉద్యోగులకన్నా తక్కువగా ఉన్న ఐటీ సంస్థల్లో ఇప్పటికే 20 శాతం మంది కార్యాలయాలకు వస్తున్నారని పేర్కొంది. 76 శాతం కంపెనీల్లో 9 శాతం మంది కార్యాలయాలకు వస్తుండగా, మధ్యస్థాయి, పెద్ద, అతి పెద్ద (ఎంఎల్‌వీఎల్‌) కంపెనీల ఉద్యోగుల్లో 5 శాతం మంది కార్యాలయాలకు వస్తున్నారని హైసియా అధ్యక్షుడు భరణి కుమార్‌ అరోల్‌, ఎక్స్‌ అఫీషియో మెంబర్‌ ఆర్‌.శ్రీనివాస్‌ రావు మంగళవారం ఇక్కడ వెల్లడించారు.

  • ఈ ఏడాది చివరికి తమ ఉద్యోగులందరినీ ఆఫీసుకు రప్పించాలని 33 శాతం సంస్థలు భావిస్తుంటే, 2022లో ఈ పని పూర్తి చేయాలని 41 శాతం కంపెనీలు అనుకుంటున్నాయి. బహుళజాతి సంస్థలు మాత్రం, తమ ప్రధాన కార్యాలయాల ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించనున్నాయి. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు 6 లక్షల మంది అయితే 2 లక్షల మందికి పైగా దూర ప్రాంతాల నుంచే పనిచేస్తున్నారు. 70 శాతానికి పైగా సంస్థలు హైబ్రిడ్‌ పని విధానానికే మొగ్గు చూపుతున్నాయి. అంటే కొవిడ్‌ టీకా రెండు డోసులు పూర్తయిన వారిని వారానికి 3 రోజులు ఆఫీసుకు రప్పించాలన్నది వీటి ప్రణాళిక. హైదరాబాద్‌లో నివశిస్తున్న ఉద్యోగులతో అయితేనే ఇది సాధ్యమవుతుంది. చిన్న సంస్థలు మాత్రం 'టీకా వేయించుకుంటేనే అనుమతి'కి ప్రాధాన్యం ఇవ్వడం లేదని తెలుస్తోంది.
  • ఇంటి నుంచి పని వల్ల ఉత్పాదకత తగ్గిందని 22శాతం సంస్థలు తెలిపాయి. క్లయింట్ల కోసం ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించాలని 27శాతం సంస్థలు అనుకుంటున్నాయి. విద్యాసంస్థలు మొదలుకానందున, దంపతులిద్దరూ ఉద్యోగులుగా ఉంటే.. పిల్లలను ఎవరు చూసుకుంటారనే ప్రశ్న తలెత్తుతోంది. అనుబంధ రంగాలను దృష్టిలో పెట్టుకుని, ఉద్యోగులను కార్యాలయానికి రప్పించాలని భావిస్తున్నట్లు 39 శాతం సంస్థలు తెలిపాయి.
  • హైసియా-కాండ్యూరా సంయుక్తంగా ఇంటర్న్‌షిప్‌ ఫెయిర్‌ను వచ్చే శనివారం నుంచి నిర్వహిస్తాయని ఆర్‌.శ్రీనివాస్‌ రావు తెలిపారు. 50 సంస్థలు, 12వేలకు మందికి పైగా విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details