తెలంగాణ

telangana

ETV Bharat / business

భారత్​కు ఏడీబీ మరో రూ.22.45 కోట్ల సాయం - COVID-19 response

కరోనా మహమ్మారి కట్టడికి అదనంగా మరో రూ.22.45 కోట్ల సాయం ప్రకటించింది ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ). ఈ నిధులను కరోనా అత్యవసర సేవల కోసం వినియోగించనున్నట్లు తెలిపింది. ఇప్పటికే గత ఏప్రిల్​లో కేర్స్​ కార్యక్రమంలో భాగంగా రూ. 11,400 కోట్లు (1.5 బిలియన్​ డాలర్ల) రుణం మంజూరు చేసింది.

ABD announces $3 million grant to India in Covid-19 fight
భారత్​కు ఏడీబీ మరో రూ.22.45 కోట్ల సాయం

By

Published : Jul 29, 2020, 5:37 AM IST

కరోనా మహమ్మారిపై పోరులో భారత్​కు ఆర్థికంగా మద్దతుగా నిలుస్తోంది ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ). మూడు నెలల క్రితం కొవిడ్​ కట్టడికి రూ. 11,400 కోట్లు (1.5బిలియన్​ డాలర్)ల మేర రుణం మంజూరు చేసిన బ్యాంకు.. తాజామరో రూ. 22.45 కోట్ల (3 మిలియన్​ డాలర్లు) ఆర్థిక సాయం ప్రకటించింది.

కరోనా విజృంభిస్తున్న వేళ తక్షణ చర్యలైన వ్యాధులపై నిఘా పెంపు, కాంటాక్ట్​ ట్రేసింగ్​, వ్యాధి నిర్ధరణ వంటి వాటి కోసం ఈ రుణం మంజూరు చేసినట్లు తెలిపింది ఏడీబీ. నిరుపేద, ఆర్థికంగా చితికిపోయిన రంగాల ప్రజలకు సామాజిక భద్రత కల్పించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

" ఈ నిధులు కొవిడ్​-19 కట్టడి చర్యల బలోపేతంలో భారత ప్రభుత్వానికి ఏడీబీ మద్దతు కొనసాగుతుందని తెలుపుతున్నాయి. వీటిని థర్మల్​ స్కానర్లు, అత్యావసరమైన సామాగ్రి కొనుగోలుకు ఉపయోగించనున్నారు."

- సోనాలిని ఖేత్రపాల్​, ఆరోగ్య నిపుణులు ఏడీబీ

ఏప్రిల్​ 28న కేర్స్​ (యాక్టివ్​ రెస్పాన్స్​ అండ్​ ఎక్స్​పెండిచర్​ సపోర్ట్​) కార్యక్రమంలో భాగంగా కరోనా కట్టడికి భారత్​కు రూ. 11,400 కోట్లు (1.5 బిలియన్​ డాలర్)ల రుణాన్ని మంజూరు చేసింది ఏడీబీ.

ఫిలిప్పీన్స్​ రాజధాని మనీలా కేంద్రంగా ఉన్న ఏడీబీ, కోవిడ్​-19 యాక్టివ్​ రెస్పాన్స్​ అండ్​ ఎక్స్​పెండిచర్​ సపోర్ట్​(కేర్స్​) కార్యక్రమం ద్వారా 80 కోట్ల మంది ప్రజలకు నేరుగా సాయం చేస్తున్నట్లు ప్రకటించింది. వేల కుటుంబాలు, నిరు పేదలు, రైతులు, ఆరోగ్య కార్యకర్తలు, దివ్యాంగులకు మెరుగైన ఆరోగ్య సదుపాయాలు కల్పించేందుకు వీటిని వినియోగించవచ్చని పేర్కొంది.

20 బిలియన్​ డాలర్లతో కొవిడ్​-19 పాండెమిక్ రెస్పాన్స్ ఆప్షన్​ను(సీపీఆర్​ఓ) కరోనాపై పోరు కోసం ఏప్రిల్​ 13న ఏర్పాటు చేసింది ఏడీబీ. సభ్యదేశాలకు ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించింది. దీని ద్వారానే కేర్స్ కార్యక్రమం నిర్వహిస్తోంది.

ఇదీ చూడండి: భారత్​కు ఏడీబీ రూ.11,400 కోట్ల సాయం

ABOUT THE AUTHOR

...view details