తెలంగాణ

telangana

ETV Bharat / business

'వ్యాయామం చేయడానికి బద్ధకమా?'

తీరిక లేని వ్యాపార కార్యకలాపాల్లో ఉన్నప్పటికీ.. సామాజిక అంశాలపై ఎప్పటికప్పుడు తన అభిప్రాయాన్ని ట్విట్టర్​లో షేర్​ చేస్తుంటారు ఆనంద్​ మహీంద్రా. ఇలానే వ్యాయామాలపై తనదైన రీతిలో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఈ మేరకు ఒలింపిక్స్​కి సంబంధించి ఓ ట్వీట్​ చేశారు.

aanand mahindra
'వ్యాయామం చేయడానికి బద్ధకమా?'

By

Published : Aug 2, 2021, 5:44 AM IST

సామాజిక మాధ్యమాల్లో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ తన ఫాలోవర్లకు ఏదో కొత్త విషయాన్ని తెలియజేసే మహీంద్రా అండ్‌ మహీంద్రా ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా మరో కొత్త చిట్కాతో మన ముందుకు వచ్చారు. ఆదివారం వ్యాయామం చేయడానికి బద్ధికించే వారికోసం ఓ వీడియో పోస్ట్‌ చేశారు. తానూ ఈ కేటగిరీకే చెందినవాడినంటూ చమత్కరించారు. ఆదివారం వ్యాయామం చేయకపోయినా.. ఆ వీడియో చూస్తే చాలని సరదాగా వ్యాఖ్యానించారు. నిజంగా ఆ వీడియోలో జిమ్నాస్ట్‌లు చేస్తున్న విన్యాసాలు చూస్తుంటే ఏ వ్యాయామం చేయకపోయినా.. మనలో ప్రతి కండరం కదలిన భావం కలగడం ఖాయమనిపిస్తోంది!

'రోజువారీ వ్యాయామ దినచర్యను ఆదివారమూ కొనసాగించేందుకు బద్ధకంగా ఫీలయ్యే రకానికి చెందినవారా మీరు? అయితే, ఒక పరిష్కారం ఉంది. నాలాగే మీరు ఈ వీడియో క్లిప్‌ను సేవ్‌ చేసుకోండి. కనీసం రెండుసార్లు చూడండి. చివరకు మీ శరీరంలోని ప్రతి కండరానికి వ్యాయామం చేసిన ఫీలింగ్‌ కలుగుతుంది. మీరు అలసిపోతారు' అని ట్విట్టర్‌లో మహీంద్రా రాసుకొచ్చారు. ఈ సందేశానికి ఆయన జత చేసిన వీడియో మీరూ చూసేయండి మరీ..!

ABOUT THE AUTHOR

...view details