తెలంగాణ

telangana

ETV Bharat / business

మంత్రుల స్థాయిలోనే అమెరికా-చైనా ఒప్పందం - china us trade war3

అమెరికా-చైనా మధ్య  వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయని శ్వేతసౌధానికి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. అయితే ఇది అధ్యక్షుల స్థాయిలో కాకుండా మంత్రి స్థాయిలో జరుగుతుందని వెల్లడించారు.

మంత్రుల స్థాయిలోనే అమెరికా-చైనా ఒప్పందం

By

Published : Nov 16, 2019, 3:41 PM IST

అగ్రరాజ్యం-డ్రాగన్​ మధ్య త్వరలో పాక్షికంగా వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని శ్వేతసౌధానికి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. అయితే, ఇది అధ్యక్షుల స్థాయిలో ఉండదని.. కేవలం మంత్రులు మాత్రమే దీనిపై సంతకాలు చేస్తారని వెల్లడించారు. అయితే, ఎప్పుడు అన్నదానిపై మాత్రం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. గతనెల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన విధంగా చైనాతో తొలిదశ ఒప్పందానికి జరుగుతున్న ప్రయత్నాల్లో పురోగతి కనిపిస్తోందని ‘నేషనల్‌ ఎకనామిక్‌ కౌన్సిల్‌’ డైరెక్టర్‌ లారీ కుడ్లో తెలిపారు.

చిలీలో జరిగే ‘ఎకనమిక్ సమ్మిట్‌’లో ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశం ఉందని గతంలో ట్రంప్‌ ప్రకటించారు. అయితే ఆ సమావేశం ప్రస్తుతం రద్దు కావడంతో అధ్యక్షులు దీనిపై సంతకం చేసే అవకాశం లేదని ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే, కొన్నిరోజుల క్రితం ట్రంప్‌ మాట్లాడుతూ.. చైనా వస్తువులపై సుంకాలు ఎత్తివేసే దిశగా ఎటుంటి ఒప్పందానికి తాను అంగీకరించలేదని ప్రకటించారు.

ఇదీ చూడండి : ఈ 10 అంశాలపై గూగుల్​లో అస్సలు వెతకొద్దు..!

ABOUT THE AUTHOR

...view details