తెలంగాణ

telangana

ETV Bharat / business

బండి కదలాలంటే లీటర్‌ పెట్రోలు ఉండాల్సిందే..! - కాలుష్యాన్ని అరికట్టేందుకు భారత్ మందడుగు

కాలుష్యాన్ని అరికట్టేందుకు భారత్ ముందడుగు వేసింది. ఈ నేపథ్యంలో మార్కెట్​లోకి భారత స్టేజ్​ (బీఎస్​)-6తో నడిచే విధంగా పెట్రోలు, డీజిల్​ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. శుద్ధి చేసిన ఈ చమురు ఏప్రిల్​ ఒకటో తేదీ నుంచి అన్ని రాష్ట్రాల్లోని వాహనదారులకు అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది.

A liter of petrol to move the vehicle
బండి కదలాలంటే లీటర్‌ పెట్రోలు ఉండాల్సిందే..!

By

Published : Mar 7, 2020, 11:50 AM IST

దేశవ్యాప్తంగా కాలుష్యాన్ని నియంత్రించేందుకు భారత్‌ స్టేజ్‌(బీఎస్‌)-6 పెట్రోలు, డీజిల్‌ను కేంద్ర ప్రభుత్వం తాజాగా విపణిలోకి తీసుకువచ్చింది. శుద్ధి చేసిన ఈ చమురు ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి అన్ని రాష్ట్రాల్లోని వాహనదారులకు అందుబాటులోకి రానుంది. దీనిలో సల్ఫర్‌ పరిమాణం పది శాతమే ఉంటుంది. ప్రస్తుతం వినియోగిస్తున్న బీఎస్‌-4 ఇంధనంలో సల్ఫర్‌ 50 శాతం వరకు ఉండటం వల్ల వాహనాల నుంచి భారీగా కాలుష్యం గాలిలోకి వెలువడుతోంది.

కనీసం ఒక లీటరు పెట్రోలు...

నూతన చమురుకు తగినట్లు ద్విచక్రవాహన తయారీదారులు బైక్‌ ఇంజిన్‌లలో మార్పులు చేశారు. దీనిలోభాగంగా ట్యాంకు నుంచి పెట్రోలు నేరుగా ఇంజినుకు చేరేలా(ఫ్యూయల్‌ ఇంజెక్షన్‌) వాటిని తీర్చిదిద్దారు. దీనిప్రకారం వాహన ట్యాంకులో కనీసం ఒక లీటరు పెట్రోలు నిల్వ ఉండాలి. అందుకనుగుణంగా ఇంధనం లేకపోతే ట్యాంకు నుంచి పెట్రోలు పంపింగ్‌ కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం వాడకంలో ఉన్న బీఎస్‌-4 వాహనాల్లో ఈ తరహా వ్యవస్థ లేకపోవటంతో ట్యాంకులో ఉన్న పెట్రోలును చివరి బొట్టు వరకు వాడుతున్నాం. అప్పటికీ ఇంజిను ఆన్‌ కాకుండా మొరాయిస్తే ప్లగ్‌(చౌక్‌)ను లాగితే స్టార్ట్‌ అవుతుంది. బీఎస్‌-6 వాహనాల్లో మాత్రం చౌక్‌ వ్యవస్థే లేదని సంబంధిత నిపుణుడు ఒకరు ‘ఈనాడు’తో చెప్పారు. ఈ వాహనాల ఇంజిను స్టార్ట్‌ చేసిన సందర్భంలో శబ్దం సైతం వెలువడదని ఆయన పేర్కొన్నారు. శుద్ధి చేసిన చమురు వాడకంతోపాటు బీఎస్‌-6 ఇంజిను కారణంగా.. సాధారణం కన్నా 12 నుంచి 14 శాతం వరకు మైలేజీ కూడా అదనంగా వస్తుందని వివరించారు.

చివరి బొట్టు దాక కుదరదు...

ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ద్విచక్ర వాహనాల్లోని పెట్రోలును చివరి బొట్టు వరకు వినియోగించుకునే సౌలభ్యం ఉంది. ప్రయాణ సమయంలో అకస్మాత్తుగా పెట్రోలు అయిపోతే.. వాహనాన్ని కిందకు వంచితే అడుగున ఉన్న కొద్దిపాటి ఇంధనంతోనూ బైక్‌ స్టార్ట్‌ అవుతుంది. ఆధునిక ఇంజిన్లతో వచ్చిన బీఎస్‌-6 వాహనాల్లో మాత్రం కనీసం లీటరు పెట్రోలు లేకపోతే బండి కదలదు. దీంతో సదరు బైక్‌లపై ప్రయాణించాలనుకునే వారు పెట్రోలు విషయంలో సదా అప్రమత్తంగా ఉండాలి.

ఇదీ చూడండి:ఏజీఆర్​, స్పెక్ట్రం బకాయిల చెల్లింపులు ముమ్మరం

ABOUT THE AUTHOR

...view details