తెలంగాణ

telangana

ETV Bharat / business

వర్క్​ ఫ్రం హోం సరిగ్గా చేస్తోంది 0.2% ఉద్యోగులే! - లాక్​డౌన్​పై కార్పొరేట్ల స్పందన

లాక్​డౌన్​ కారణంగా ఐటీ రంగ ఉద్యోగులంతా ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో కంపెనీల ఉత్పాదకత తెలుసుకునేందుకు ఓ సర్వే ప్రయత్నించింది. ఇందులో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. వర్క్​ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగుల్లో 0.2 శాతం మాత్రమే ఆశించిన స్థాయిలో రాణిస్తుండగా.. 99.8 శాతం మంది పని సంతృప్తికరంగా లేదని సర్వే అభిప్రాయపడింది.

work from home not easy
వర్క్​ ఫ్రం హోం అంత ఈజీ కాదు

By

Published : Apr 11, 2020, 7:14 AM IST

కరోనా లాక్​డౌన్​ నేపథ్యంలో ఐటీ​ కంపెనీలన్నీ తమ ఉద్యోగులకు వర్క్ ​ఫ్రం హోమ్​ ఇచ్చాయి. అయితే వర్క్​ ఫ్రం హోంలో ఐటీ ఉద్యోగులు ఆశించిన స్థాయిలో రాణించడం లేదని ఓ సర్వే పేర్కొంది.

వర్క్​ ఫ్రం హోమ్ చేస్తున్న ఉద్యోగుల్లో 0.2 శాతం మాత్రమే ఉత్తమ ప్రదర్శన కనబరుస్తున్నట్లు ఈ సర్వే తెలిపింది. మిగతా 99.8 శాతం మంది వర్క్​ ఫ్రం హోమ్ చేసేందుకు అర్హులు కారని అభిప్రాయపడింది.

దాదాపు 10,000 మంది ఐటీ ఉద్యోగులపై మైండ్​టెక్​, సైకీ అనే సంస్థలు సంయుక్తంగా ఈ సర్వేను నిర్వహించాయి.

వర్క్​ ఫ్రం హోమ్ చేయలేని 99.8 శాతం మంది.... కొత్తగా నేర్చుకోవడం, విశ్లేషణ (95 శాతం మంది), ప్రాక్టికల్​ కమ్యూనికేషన్ నైపుణ్యాల కొరత (65 శాతం), సరైన ప్రణాళిక లేకపోవడం (71 శాతం) ఇలా ఎదో ఒక అంశంలో వెనుకబడి ఉన్నట్లు సర్వే వెల్లడించింది.

ఇలా చేస్తే ఉత్తమ ఫలితాలు..

  • ప్రతి ఉద్యోగికి వేర్వేరు పనుల్లో కొన్ని బలాలు, బలహీనతలు ఉంటాయి. అలా ఉద్యోగుల్లో ఉన్న బలాల ఆధారంగా వారు చేయగల పనిని అప్పగిస్తే ఉత్తమ ఫలితాలు ఉంటాయని సర్వే తెలిపింది.
  • ఐటీ ఉద్యోగుల్లో 16.97 శాతం మంది సవాళ్లను స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటారని.. వారికి చిన్న చిన్న సలహాలు ఇస్తే చాలు సజావుగా ఇచ్చిన పనిని పూర్తి చేస్తారని సర్వే పేర్కొంది.
  • మరో 17 శాతం మంది ఉద్యోగులకు మాత్రం ఇచ్చిన పని గురించి పూర్తి వివరాలు చెప్పి.. స్పష్టమైన ఆదేశాలతో కావాల్సిన అవుట్​పుట్​ను రాబట్టుకోవాల్సి ఉంటుందని వివరించింది.
  • సర్వే గణాంకాల ప్రకారం 40.42 శాతం ఐటీ ఉద్యోగులకు ఎప్పటికప్పుడు టాస్క్​లు ఇచ్చి, నిరంతరం అనుసంధానమవుతూ ఉండటం ద్వారా కావాల్సిన అవుట్​పుట్​ను రాబట్టుకోవచ్చని సర్వే సూచించింది.
  • ఐటీ ఉద్యోగుల్లో దాదాపు 12.7 శాతం మంది తమకు ఇచ్చిన పనిని ఇతరులతో చర్చించి పూర్తి చేయగలుగుతారు. అలాంటి వారికి వర్క్​ ఫ్రం హోం అనేది సవాలుతో కూడుకున్నదని సర్వే అభిప్రాయపడింది. నిజానికి అలాంటి వారు వారికి ఇచ్చే టాస్క్​ గురించి ఎక్కువగా భయపడనప్పటికీ.. అవసరమైనప్పుడు ఇతరులతో మాట్లాడేందుకు గాను తరచూ వీడియో కాన్ఫరెన్స్​లు, ఫోన్ సంభాషణల ద్వారా వారి సందేహాలను తీరిస్తే మంచి ఫలితాలు వస్తాయని సర్వే విశ్లేషించింది.

కరోనా ప్రభావం ఆరు నెలలు..

కరోనా మహమ్మారి ప్రభావం అన్ని రంగాలపై ఆరు నెలల వరకు ఉంటుందని 72 శాతం సంస్థలు అభిప్రాయపడుతున్నట్లు ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ సర్వేలో తేలింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే సౌకర్యం కల్పించడం ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొంది.

ఇదీ చూడండి:కొవిడ్​-19 ఆరోగ్య పాలసీలు.. సరికొత్తగా మీ కోసం!

ABOUT THE AUTHOR

...view details