తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆన్​లైన్ యూజర్లలో 83% మందివి వీక్ పాస్​వర్డ్​లు!

ఆన్​లైన్ యూజర్లలో 83 శాతం మంది తమ పాస్​వర్డ్​లు బలహీనమైనవని భావిస్తున్నట్లు సైబర్​ సెక్యూరిటీ పరిశోధకులు తెలిపారు. 54 శాతం మందికి తమ వివరాలు లీక్​ అయ్యాయో లేదో ఎలా తెలుసుకోవాలనే విషయంపై అవహగాన లేదని వెల్లడించారు.

By

Published : May 24, 2020, 1:26 PM IST

83% online users think up their own, weak passwords
ఆన్​లైన్ యూజర్లలో 83 శాతం మందివి వీక్ పాస్​వర్డులు!

ఆన్​లైన్​ వినియోగదారులు పాస్​వర్డ్​లు వినియోగించడం సర్వసాధారణం. బలమైన పాస్​వర్డులు ఉంటేనే వ్యక్తిగత సమాచారానికి భద్రత ఎక్కువ. అయితే 83 శాతం మంది తమవి బలహీనమైన పాస్​వర్డ్​లు అని భావిస్తున్నారు. తమ వివరాలు లీక్​ అయ్యాయా? లేదా? అనే విషయం ఎలా తెలుసుకోవాలనే విషయంపై 54 శాతం మందికి అవగాహన లేదని గుర్తించారు సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు.

ఈ-మెయిల్, సామాజిక మాధ్యమాలు సహా అనేక ఆన్​లైన్​ సేవలకు పాస్​వర్డ్​ల వినియోగం తప్పనిసరి. అవి ఎంత క్లిష్టంగా ఉంటే అంత సురక్షితం. ప్రస్తుతం ప్రతి యాప్​లో పాస్​వర్డ్​ లేకుండా లాగిన్​ అవ్వలేని పరిస్థితి. క్లిష్టమైన వాటిని గుర్తుంచుకోవడం యూజర్లకు కష్టంగా మారింది. అంతేకాక వీటిని తరచూ మార్చుకోవాల్సి ఉంటుంది. పాస్​వర్డ్​లను రహస్యంగా భద్రపరుచుకోవడం కూడా సవాలే. కొంత మంది యూజర్లు తమ పాస్​వర్డ్​లను వ్యక్తిగత కంప్యూటర్లలో ఫైల్​ క్రియేట్​ చేసుకుని భద్రపరుచుకుంటున్నారు.

55 శాతం మంది ఆన్​లైన్​ వినియోగదారులు తాము ఉపయోగించే అన్ని పాస్​వర్డ్​లను గుర్తుంచుకుంటున్నట్లు చెప్పారని కాస్పర్​స్కై నివేదికలో తెలిపింది. ప్రతి ఐదుగురిలో ఒకరు(19 శాతం) పాస్​వర్డ్​లను తమ కంప్యూటర్లలో భద్రపరచుకుంటున్నారని, 18 శాతం మంది బ్రౌజర్లు, స్మార్ట్​ఫోన్లు, ట్యాబ్​లలో సేవ్​ చేసుకుంటున్నారని పేర్కొంది.

ఆన్​లైన్​ వినియోగదారులు బలమైన పాస్​వర్డ్​లను క్రియేట్​ చేసుకోవాల్సిన అవసరం ఉందని కాస్పర్​స్కై నివేదిక స్పష్టం చేస్తోంది. ‘Have I Been Pwned?' వంటి ఆన్​లైన్​ సేవల ద్వారా తమ వివరాలు లీక్​ అయ్యాయో లేదో తెలుసుకుని మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తోంది. అకౌంట్ లాగిన్ వివరాలు ఎవరితో పంచుకోవద్దని, ఇతరులు ఉపయోగించే కంప్యూటర్లు, స్మార్ట్​ఫోన్లలో మీ వివరాలు సేవ్​ చేసుకోవద్దని సలహా ఇస్తోంది.

ABOUT THE AUTHOR

...view details