తెలంగాణ

telangana

ETV Bharat / business

'కొత్త ఆదాయ పన్ను విధానంతో ఉద్యోగులకు నష్టమే!' - నూతన ఆదాయ పన్ను విధానంపై అసంతృప్తి

ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ 2020-21 బడ్జెట్​లో ప్రకటించిన నూతన పన్ను విధానంపై 81శాతం మంది హెచ్​ఆర్, ఆర్థిక నిపుణులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు మెర్సర్ సర్వే తెలిపింది. ఈ నూతన పన్ను విధానం ఉద్యోగులకు లబ్ధి చేకూర్చకపోగా, కంపెనీలకు భారంగా మారుతుందని వారు అభిప్రాయపడినట్లు పేర్కొంది.

mercer Survey
కొత్త ఆదాయ పన్ను విధానంతో ఉద్యోగులకు నష్టమే

By

Published : Mar 3, 2020, 7:24 PM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పన్ను విధానంపై 81 శాతం మంది ఆర్థిక, మానవ వనరుల (హెచ్​ఆర్​) విభాగ నిపుణులు అసంతృప్తిగా ఉన్నారని ఓ సర్వే తెలిపింది. ఈ నూతన పన్ను స్లాబుల వల్ల తమ ఉద్యోగులకు ఏ మాత్రం ప్రయోజనం చేకూరదని వారు అభిప్రాయపడుతున్నట్లు పేర్కొంది.

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2020-21 కేంద్ర బడ్జెట్​లో ఈ నూతన పన్ను స్లాబులను ప్రతిపాదించారు. ఇవి కూడా ఐచ్ఛికమేనని స్పష్టం చేశారు. ప్రముఖ మానవ వనరుల సర్వే సంస్థ మెర్సర్​... ఈ నూతన పన్ను స్లాబుల గురించి 119 కంపెనీలకు చెందిన హెఆర్​ అధికారులను, ఆర్థిక నిపుణుల అభిప్రాయాలు సేకరించింది.

ఇబ్బందులు వస్తాయ్​!

మెర్సర్ సర్వే ప్రకారం... సంవత్సర ఆదాయం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు; రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షలు ఉన్న వారికి కొత్త పన్ను విధానం వల్ల ఇబ్బందులు వస్తాయని 60 శాతం మంది భావిస్తున్నారు.

అలాగే ఈ నూతన పన్ను విధానం... ఉద్యోగుల పదవీ విరమణ సేవింగ్స్​పై ప్రతికూల ప్రభావం చూపవచ్చని 80 శాతం మంది యజమానులు భావిస్తున్నారు. దీని వల్ల యాజమాన్యాలు ఇచ్చే స్వచ్ఛంద ఆర్థిక ప్రయోజనాలు తీసుకునేందుకు ఉద్యోగులు దూరంగా ఉంటారని, ఎక్కువ ఆదాయం పొందేవారు తమ పెట్టుబడులను ఇతర మార్గాల్లోకి మళ్లిస్తారని అభిప్రాయపడ్డారు.

ఇదో సవాల్​

కొత్త పన్ను విధానం గురించి తమ ఉద్యోగులకు చెప్పడం పెద్ద సవాల్​గా మారిందని కంపెనీల మానవవనరుల విభాగధిపతులు భావిస్తున్నారని మెర్సర్ సర్వే తెలిపింది. రెండు ఆదాయపు పన్ను విధానాలను నిర్వహించడం కూడా ఆర్థికంగా భారం అవుతుందని భావిస్తున్నట్లు వెల్లడించింది.

ఈ నూతన పన్ను స్లాబు విధానాన్ని 30 శాతం కంటే తక్కువ మంది ఉద్యోగులే ఎంచుకునే అవకాశం ఉందని 83 శాతం మంది నిపుణులు అభిప్రాయపడుతున్నట్లు సర్వే తెలిపింది.

ఇదీ చూడండి:కరోనాపై భారత్ భారీ​ యుద్ధం- త్రివిధ దళాలకు బాధ్యత

ABOUT THE AUTHOR

...view details