ప్రపంచవ్యాప్తంగా 82 శాతం మంది విద్యార్థులు కొవిడ్ సంక్షోభం కారణంగా కొత్త కొలువులు వస్తాయని, నైపుణ్య అవసరాలు పెరుగుతాయని అభిప్రాయపడుతున్నట్లు ప్రముఖ డిజిటల్ లెర్నింగ్ సంస్థ పీర్సన్ తెలిపింది. భారతీయ విద్యార్థుల్లో 80శాతం మంది కూడా దీనిని నమ్ముతున్నారని పేర్కొంది. వీరిలో 77 శాతం మంది కరోనా కారణంగా తమ జీవనోపాధి మార్గం గురించి పునరాలోచించుకోవాల్సి వచ్చిందని తెలిపినట్లు సర్వే పేర్కొంది.
భారత్ నుంచి 1000మంది సహా ప్రపంచవ్యాప్తంగా మొత్తం 7000మంది విద్యార్థుల నుంచి అభిప్రాయాలు సేకరించింది పీర్సన్ సంస్థ. వీరిలో 88 శాతం మంది ప్రాథమిక, ఉన్నత విద్యలో ఇక ఆన్లైన్ లెర్నింగ్ శాశ్వతంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.