జీవిత బీమా ఎంత అవసరమో కరోనా వల్ల చాలా మందికి తెలియవచ్చింది. దీంతో బీమాలు తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే మిలీనియల్స్.. జీవిత బీమాపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. అసోచామ్ ఇటీవల చేసిన సర్వేలో కూడా ఇదే తేలింది. 70 శాతం మంది మిలీనియల్స్ జీవిత బీమాను తీసుకునేందుకు మొగ్గుచూపుతున్నట్లు ఆ సర్వే తేల్చింది.
బీమాపై ఇటీవల ఎక్కువ అవగాహన వచ్చింది. డిజిటలైజేషన్‌తో ప్రతి ఒక్కరికి బీమాకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంటుంది. పలు రకాల అంకురాలు కూడా బీమాకు సంబంధించిన సమాచారాన్ని.. సాంకేతికను ఉపయోగించే వారికి మరింత దగ్గర చేశాయి.
సాధారణంగా మిలీనియల్స్‌కు సాంకేతికతపై పట్టు ఎక్కువగా ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా బీమా రంగంలో చాలా మార్పులు వచ్చాయి. ఆన్‌లైన్‌లో సులభంగా పాలసీ తీసుకునేందుకు వీలు ఉంటోంది. అయితే వీరు జీవిత బీమా తీసుకునేందుకు వివిధ కారణాలున్నాయి.
కొనుగోలు సులభం..
ప్రస్తుతం చాలా మందికి ఇంటర్నెట్ వాడకంపై అవగాహన ఉంది. ఇంటర్నెట్ వాడకం మిలీనియల్స్‌కైతే చాలా సులభం. ఆన్‌లైన్ ద్వారా సౌకర్యవంతంగా పాలసీ తీసుకోవచ్చు. పాలసీని ఎంచుకొని ఆన్‌లైన్ పేమెంట్ చేసుకోవచ్చు. నెప్ట్, ఐఎమ్‌పీఎస్, వ్యాలెట్ పేమెంట్లలో ఏదో ఒకదానిని ఎంచుకోవచ్చు. ఆన్‌లైన్ పేమెంట్ సురక్షితమైనది కూడా.
జీవిత బీమా తీసుకునే సమయంలో డాక్యుమెంటేషన్ ప్రక్రియ చాలా సులభం. గుర్తింపు, వేతనం సహా మరికొన్ని ఆధారాలు సమర్పిస్తే సరిపోతుంది. సమస్యలు లేకుండా జీవిత బీమా తీసుకోవచ్చు.
తక్కువ ప్రీమియం రేట్లు..
ప్రజలు జీవిత బీమా పాలసీని తీసుకునేందుకు ప్రధాన కారణం... ప్రీమియం తక్కువగా ఉండటం. తక్కువ మొత్తంతో ఎక్కువ కవరేజీ పొందవచ్చు. దీని వల్ల జీవిత బీమా చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. అన్ని కంపెనీల పాలసీలను పోల్చిచూసుకోవటం ప్రస్తుత రోజుల్లో చాలా సులభమైంది. ఆన్‌లైన్‌లో ప్రీమియానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు.
ఆర్థిక లక్ష్యాలను సాధించుకోవటం..