దేశంలో 5జీ ప్రధాన నెట్‌వర్క్ బాధ్యతలు భారతీయ కంపెనీల చేతుల్లోనే ఉండాలని కేంద్ర టెలికాంశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టంచేశారు. దేశంలో కొత్తతరం సాంకేతిక పరిజ్ఞానం కోసం దేశీయంగా అభివృద్ధి చేసిన టెలికాం సాధనాలతో వేగంగా ముందుకు సాగాలని ఆకాంక్షించిన ఆయన, 5జీ టెక్నాలజీ కోసం జరిగే ప్రయోగాల కోసం త్వరలోనే ప్రభుత్వం అనుమతి ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
ఇప్పటికే 4జీ సాంకేతికతలో వెనుకబడి ఉన్నాం. కానీ, 5జీలో మాత్రం ప్రపంచ దేశాల కంటే ముందుండాలి. ఇందుకోసం ఇప్పటికే పరీక్షావేదికను సిద్ధం చేశాం, త్వరలోనే వీటికి అనుమతులు రానున్నాయి. అయితే, వీటి ప్రధాన నెట్‌వర్క్ మాత్రం భారతీయ కంపెనీ చేతుల్లోనే ఉండాలి. 5జీ అందుబాటులోకి రావడం కేవలం సాంకేతికరంగంలో మార్పులే కాకుండా, ఎన్నో అవకాశాలను కల్పిస్తుంది. అంతేకాకుండా, సమాచార ఆర్థికవ్యవస్థలో భారత్ అతిముఖ్యమైన కేంద్రంగా నిలవాలి.