ప్రముఖ టెలికాం కంపెనీ ఎరిక్సన్.. 5జీ సేవలపై కీలక ప్రకటనలు చేసింది. 2026 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3.5బిలియన్ల 5జీ కనెక్షన్లు ఉంటాయని అంచనా వేసింది. భారత్లో 2026 నాటికి 35కోట్ల మందికిపైగా 5జీ సాంకేతికతను వినియోగిస్తారని పేర్కొంది. వచ్చే ఏడాదిలో భారత్కు మొదటి 5జీ కనెక్షన్ రావచ్చని ఎరిక్సన్ సంస్థ భారత అధ్యక్షుడు నితిన్ బన్సాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ప్రపంచ జనాభాలో దాదాపు 15శాతం మంది 5జీ సాంకేతికతను వినియోగిస్తున్నారని 'ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్టు' లో సంస్థ వెల్లడించింది. 2026నాటికి ప్రపంచ జనాభాలో 60శాతం 5జీ టెక్నాలజీని వినియోగిస్తారని రిపోర్ట్ తెలిపింది.