కేంద్ర బడ్జెట్ సాధారణ పౌరులను సంతృప్తిపరచలేదని ఓ సర్వేలో వెల్లడైంది. తాజా బడ్జెట్ వల్ల ధరలు పెరుగుతాయన్న ఆందోళనతో ప్రజలు ఉన్నట్లు తేలింది. ఈ మేరకు నిర్వహించిన పోల్‌లో 45శాతం మంది బడ్జెట్‌తో సంతృప్తి చెందలేదని తెలిపారు. 35.8శాతం మంది మాత్రం పద్దును స్వాగతించారు. గతేడాది నిర్వహించిన ఇదే తరహా పోల్‌లో 64.2శాతం మంది అప్పటి బడ్జెట్‌కు మద్దతిచ్చారు.
తాజా సర్వేలో 1,200మంది పాల్గొన్నారు. సర్వే ప్రకారం ధరలు తగ్గే అవకాశం లేదని 46.1శాతం మంది ప్రజలు పేర్కొన్నారు. 18.1శాతం మంది మాత్రం కొంతమేర తగ్గుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:బడ్జెట్లో వేతన జీవులకు షాక్!
గత ఏడాది కాలంలో తమ జీవన ప్రమాణాలు తీవ్రంగా పడిపోయాయని సర్వేలో పాల్గొన్న 50.7 శాతం మంది తెలిపారు. వచ్చే ఏడాది పరిస్థితులు మెరుగవుతాయని 27.6 శాతం మంది ఆశిస్తుండగా.. జీవన ప్రమాణాలు మరింత దిగజారే అవకాశం ఉందని 29 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు.
ఖర్చులు పెరుగుతాయ్