కరోనా మహమ్మారి వల్ల దేశవ్యాప్తంగా 41 లక్షల మంది యువత ఉద్యోగాలు కోల్పోయినట్టు ఓ నివేదిక తెలిపింది. నిర్మాణం, వ్యవసాయ రంగంలోనే అత్యధికంగా ఉద్యోగాలు పోగొట్టుకున్నట్టు పేర్కొంది.
"టాక్లింగ్ ది కొవిడ్-19 యూత్ ఎంప్లాయిమెంట్ క్రైసిస్ ఇన్ ఏషియా అండ్ ది పసిఫిక్" అనే పేరుతో అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ), ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించింది.
పెద్దల (25ఏళ్లు పైబడిన) కన్నా యువత (15-24ఏళ్ల)పైనే సంక్షోభ ప్రభావం అధికంగా పడిందని.. ఇది దీర్ఘకాలికంగా వారి ఆర్థిక, సామాజిక జీవితాలపై ప్రభావం చూపుతుందని నివేదిక పేర్కొంది.